తన కొడుకును ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడు డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. గత రెండు చిత్రాలూ ఫెయిల్ అవ్వడంతో, ఈ సారి మాత్రం ఉడుం పట్టు పట్టేశాడు. 'రొమాంటిక్' టైటిల్‌తో కుర్రోన్ని యూత్‌ఫుల్ హీరోగా మలచాలనుకుంటున్నాడు. ఆ క్రమంలోనే ఈ సినిమాకి ఫస్ట్‌లుక్ ఎలాంటిది రిలీజ్ చేశాడో అందరూ చూసేశాం. అయితే, హీరోగా నిలదొక్కుకోవాలంటే, అడల్ట్ కంటెంట్ తప్పదా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
పూరీ జగన్నాధ్ గత చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'లో చూపించిన ఘాటు రొమాన్స్ తెలిసిందే కదా. ఆల్రెడీ కొంత స్టార్‌డమ్ ఉన్న రామ్ వంటి హీరోకే తప్పలేదు అడల్ట్ డోస్. ఇక ఆకాష్ వంటి హీరో సంగతి చెప్పనే అక్కర్లేదు కదా. అందుకే మళ్లీ పూరీ దాన్నే నమ్ముకున్నాడు. కొడుకును దిమ్మాక్ ఖరాబ్ అయ్యేలా రొమాంటిక్ లుక్‌లోకి మార్చేశాడు. ఎంతలా ఖరాబ్ చేశాడంటే, ఆ డోస్ కాస్తా శృతిమించిపోయి విమర్శలకు తావిచ్చేలా చేస్తోంది.
లేటెస్ట్ పోస్టర్ మరీ బూతు సినిమాల్ని తలపించేలా ఉందంటూ, కొడుకును హీరోగా నిలబెట్టేందుకు పూరీ మరీ ఇంతలా దిగజారిపోతాడా.? అంటూ నెటిజన్స్ గుస్సా అవుతున్నారు. ఎవరేమనుకుంటే ఏంటీ.? ఆయన పూరీ జగన్నాధ్. ఆయనకు నచ్చిందే చేస్తాడు. అదే ఇస్మార్ట్ అంటాడు. అందుకే ఆయన స్మార్ట్ పూరీ. దట్సాల్.