బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కి ఫైర్ బ్రాండ్‌గా పేరున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చేసి, వార్తల్లో నిలవాలనుకుంటుంది. తనకు నచ్చని వాళ్లపై నచ్చినట్లుగా మాటలతో విరుచుకుపడుతుంటుంది. బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో హృతిక్ రోషన్ అంటే కంగనాకి అస్సలు పడదు. ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఆడిపోసుకుంటూనే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా హృతిక్‌ని ఆడిపోసుకున్న విధానం కొంచెం కొత్తగా ఉంది. తాను కనుక హృతిక్ రోషన్ అయితే, కంగనాకి ఫోన్ చేసి, సారీ అడుగుతానని చెప్పింది. విచిత్రంగా ఉంది కదా.
మరి ఇలాంటి విచిత్రమైన క్వశ్చన్స్ విలేఖరుల నుండి వస్తే, అదీ కంగనా వంటి వారి వద్ద వస్తే, ఇలాంటి ఆన్సర్సే వస్తాయి. కంగనా ఏంటీ? హృతిక్‌లా మారిపోవడమేంటీ? ఊహించుకుంటేనే వింతగా ఉంది. అందుకే ఆమె అలాంటి వింత సమాధానం చెప్పింది. అయితే గమనించాల్సిందేమంటే, కంగనా చెప్పింది వింత సమాధానం ఎంత మాత్రమూ కాదు, హృతిక్ పట్ల తనకున్న అభిప్రాయాన్ని ఈ విధంగా ఎక్స్‌ప్రెస్ చేసిందన్నమాట.
ఆమె ప్రస్తుతం 'తలైవి' చిత్రం కోసం సంసిద్ధమవుతోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్యాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జయలలితలా మేకోవర్ కోసం కంగనా కసరత్తులు చేస్తోంది.