ఉగాది సందర్భంగా బాలకృష్ణ సినిమా టైటిల్ `అఖండ` ప్రకటన వచ్చేసింది. దాంతో పాటు... బాలయ్య సెకండ్ లుక్ కూడా రివీల్ అయిపోయింది. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనిపిస్తాడన్న విషయం ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అఘోరా పాత్రని శివ భక్తుడిగా మార్చారు. ఆ పాత్రని టీజర్ లో పరిచయం చేసేశారు.
`హర హర మహాదేవ` అంటూ బాలయ్య ఎంట్రీ ఇచ్చాడు టీజర్లో. నిజానికి... ఇది ఇంట్రవెల్ బ్యాంగ్. రెండో పాత్రని పరిచయం చేసే ఘట్టం. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ అన్న సంగతి.. ఈ సీన్ ద్వారానే తెలుస్తుందట. ఓ బాలయ్య అరెస్ట్ అవ్వం, ఒంటరిగా ఉన్న హీరోయిన్ ని రౌడీలు వెంబడించడం, ఆమె ఆశ్రయం కోసం ఓ గుహలోకి వెళ్లడం, అక్కడ రెండో బాలయ్య ఒంటికాలుపై నిలబడి తపస్సు చేసుకోవడం... ఇవన్నీ ఇంట్రవెల్ ముందొచ్చే సీన్లు. అసలు ఈ కథలో రెండో హీరో కూడా ఉన్నాడన్న విషయాన్ని అప్పుడే రివీల్ చేస్తారు. అదే సీన్ ని... ఇప్పుడు టీజర్ లో చూపించేశారు. అంటే ట్విస్ట్ ని ముందే చెప్పేశాడన్నమాట. అఘోరాగా బాలయ్య అనగానే అభిమానులు కంగారు పడ్డారు. ఆ పాత్రని ఎలా చూపిస్తారో అని. అయితే దాన్ని శివ భక్తుడిగా మార్చి.... బాలయ్యకు కొత్త లుక్ లోకి దింపి, ఓకే అనిపించుకున్నాడు బోయపాటి.