అఖిల్ అక్కినేని తన మూడవ చిత్రాన్ని తొలిప్రేమ చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు వెంకి అట్లూరి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశారు.
ఇదిలావుండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ముహూర్తం పెట్టేసినట్టు సమాచారం అందుతున్నది. ఈ నెల ఆఖరి వారంలో లండన్ కి ఈ చిత్ర యూనిట్ వెళ్ళనుంది. అక్కడి నుండే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ మొదలుకానుంది.
ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకి సంబంధించి మూడు పాటలు రికార్డ్ కూడా చేయడం జరిగింది. ఒక భారీ షెడ్యూల్ ని లండన్ లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది, ఆ షెడ్యూల్ అయ్యాక ఇక్కడ మరొక షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయనున్నట్టు తెలిసింది.
మొత్తానికి అఖిల్ తన మూడవ చిత్రంతో నైనా హిట్ కొట్టాలని ఆశిద్దాం..