సాయి పల్లవి ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకుంటోంది. తొలి సినిమాకే ఆయా భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ.
తెలుగులో 'ఫిదా'తో అందర్నీ ఫిదా చేసేసిన ఈ ముద్దుగుమ్మ ఎలాంటి క్యారెక్టర్‌నైనా డీల్ చేయగల సత్తా ఉన్న నటి. గ్లామర్‌కు కాస్త దూరమైనా, యాక్టింగ్ టాలెంట్‌లో మస్త్ జోరులే. ఆ విషయం తన ఫస్ట్ మూవీతోనే 100కి 100 శాతం ప్రూవ్ చేసుకుంది. సినిమా కోసం ఎంతటి కష్టాన్నైనా భరించగల అతి కొద్దిమంది హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. సినిమాలో తన క్యారెక్టర్‌ని తనకు అలా ఆపాదించేసుకుంటుంది. 'ఫిదా'లో భానుమతిగా హీరోని డామినేట్ చేసి నటించేసింది.
అయితే ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడీ భామ తెలుగుతో పాటు, తమిళంలోనూ ఏకకాలంలో సినిమాలు చేస్తోంది. కోలీవుడ్‌లో ధనుష్, సూర్య వంటి స్టార్ హీరోలతో నటిస్తోంది. వీటిలో ధనుష్‌తో సాయి పల్లవి నటిస్తున్న 'మారి 2' చిత్రం కోసం కొత్త అవతారమెత్తబోతోందట సాయి పల్లవి. ఇంతవరకూ చిలిపితనంతో, అల్లరి పిల్లగానూ, 'కణం' వంటి సినిమాలో ఓ పాపకి తల్లిగా హుందా అయిన పాత్రలోనూ కనిపించి మెప్పించిన సాయి పల్లవి ఈ సినిమాలో ఆటో డ్రైవర్‌గా నటించబోతోందంటూ కోలీవుడ్ వర్గాల సమాచారమ్.
అంతేకాదు, ఈ పాత్రకి నేచురాలిటీ కోసం అమ్మడు ఆటో డ్రైవింగ్ కూడా నేర్చేసుకుంటోందట. ఎంత డెడికేషనో కదా. అదే సాయి పల్లవి అంటే. మరో పక్క తమిళంలో సూర్య - సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఎన్జీకే' చిత్రంలో సాయి పల్లవి నటిస్తోంది. అలాగే తెలుగులో శర్వానంద్ హీరోగా 'పడి పడి లేచె మనసు' చిత్రంలో నటిస్తోంది సాయి పల్లవి.