అఖిల్ సార్ధక్, తొలి కంటెస్టెంట్ అయ్యాడు గ్రాండ్ ఫినాలేకి అర్హత సాధించడం ద్వారా. అయితే, అనూహ్యంగా అతనికి బిగ్ హౌస్‌లో 'పులిహోర రాజా' అనే బిరుదు ఇచ్చేశారు.. అంతా ముక్త కంఠంతో. ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది బిగ్ బాస్ వ్యూయర్స్‌లో. కుమార్ సాయి ఎలిమినేషన్ సమయంలో, 'కరివేపాకు' అనే ట్యాగ్ అఖిల్ సార్ధక్‌కి లభించింది. అదేదో ఆషామాషీగా దక్కిన ట్యాగ్ కాదట.
అఖిల్ చుట్టూ హైప్ క్రియేట్ చేసి, టాప్ ఫైవ్ నుంచి మొదటగా అతన్నే ఎలిమినేట్ చేయబోతున్నారనే ప్రచారం తెరపైకొచ్చిందిప్పుడు. బిగ్‌బాస్ చుట్టూ ఇలాంటి గాసిప్స్ కొత్తేమీ కాదు.. ఇన్‌సైడ్ సమాచారం కూడా ఎప్పటికప్పుడు సరికొత్తగా బయటకు వస్తూనే వుంది. అంతా ఆ ఇన్‌సైడ్ సోర్సెస్ చెబుతున్న విషయాల్ని బట్టే నడుస్తోంది. ఇప్పుడు అఖిల్ విషయంలోనూ అలాంటి లీకులు బయటకు వస్తున్న దరిమిలా, అఖిల్ అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
కాగా, వచ్చేవారం ఎలిమినేట్ అయ్యేదెవరు.? అన్నదానిపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యాక.. ఎలిమినేట్ అవబోయేదెవరన్నదానిపై దాదాపు ఓ క్లారిటీ వచ్చేస్తుందనుకోండి.. అది వేరే సంగతి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అఖిల్ సార్ధక్ ఇమేజ్‌ని టోన్‌డౌన్ చేసే ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కాబోతోందట. మోనాల్‌ని ఎలివేట్ చేసి, అఖిల్‌ని డల్ చేయబోతున్నారని సమాచారం.