ఏ ముహూర్తాన `సర్కారు వారి పాట` ఆలోచనకు బీజం పడిందో గానీ, ఈ సినిమాకి అన్నీ అడ్డంకులే. స్క్రిప్టు పూర్తయినా, మహేష్ ఓకే చెప్పడానికి టైమ్ పట్టింది. మహేష్ ఓకే అన్నాక.. మొదలవ్వడానికి ఇంకా సమయం తీసుకుంది. ఈ మధ్యలో కరోనా గోల గురించి చెప్పేదేముంది? ఇటీవల ఈసినిమాని లాంఛనంగా ప్రారంభించారు. జనవరి నుంచి అమెరికాలో షూటింగ్ అన్నారు. ఇప్పుడు ఈ సినిమాకి మరో స్పీడ్ బ్రేకర్ పడింది.
జనవరి లో జరగాల్సిన అమెరికా షెడ్యూల్ ని చిత్రబృందం వాయిదా వేసింది. ఆ షెడ్యూల్ ని మార్చి, లేదా ఏప్రెల్ లో మొదలెడతారు. అయితే.. జనవరిలో ఇండియాలోనే షూటింగ్ మొదలయ్యే ఛాన్సుంది. అందుకోసం హైదరాబాద్ లో ఓ ప్రత్యేకమైన సెట్ వేస్తున్నారు. ఆ పనుల్ని ఇప్పుడు మరింత ముమ్మరం చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా నటిస్తాడని టాక్.