అలియా భట్.. ఎట్టకేలకు హైద్రాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ బ్యూటీ తెలుగులో తొలి సినిమా 'ఆర్ఆర్ఆర్'పై చాలా ఆశలే పెట్టుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటించాలనే కోరిక ఇంకా తీరలేదుగానీ, ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమాలో మాత్రం ఆమె అవకాశం దక్కించుకుంది. కాగా, అలియా ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ పెద్దయెత్తున గాసిప్స్ పలుమార్లు వచ్చాయి. కానీ, అలియా మాత్రం.. రాజమౌళి దర్శకత్వంలో నటించే ఛాన్స్‌ని వదులుకోలేదు.
ఈ క్రమంలో ఆమె కొన్ని బాలీవుడ్ సినిమాల్నీ పక్కన పెట్టాల్సి వచ్చిందట. రామ్‌చరణ్ సరసన అలియా, 'ఆర్ఆర్ఆర్' సినిమాలో హీరోయిన్‌గా నటించనున్న విషయం విదితమే. అయితే, ఈ సినిమాలో ఆమె పాత్ర.. ఇటు రామ్‌చరణ్‌తోనూ, అటు ఎన్టీఆర్‌తోనూ కనెక్ట్ అయి వుంటుందట. అదెలా.? అన్నది మాత్రం తెరపైనే చూడాలట.
మరోపక్క, అలియా భట్ పాత్ర నిడివి చాలా తక్కువ అనీ, కొద్ది రోజులు మాత్రమే ఆమె షూటింగ్‌లో పాల్గొంటుందనీ అంటున్నారు. అదే సమయంలో, పక్కా ప్లానింగ్‌తో అలియా నటించబోయే ఎపిసోడ్స్‌ని షూట్ చేయనున్న రాజమౌళి, పాత్ర నిడివి ఎక్కువే అయినా.. చాలా తక్కువ సినిమాలో షూటింగ్ పూర్తి చేసెయ్యబోతున్నాడట. 'రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర, పెద్ద పాత్ర అని వుండదు. ప్రతి పాత్రకీ ప్రాధాన్యత వుంటుంది..' అని అలియా ఈ మధ్యనే వ్యాఖ్యానించింది. ఇంతకీ, 'ఆర్ఆర్ఆర్'లో అలియా పాత్ర నిడివి ఎంత.? ఇదయితే, ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్.