అమెరికాలో అఖిల్‌ 'హలో' కొత్త కొత్తగా

మరిన్ని వార్తలు

అఖిల్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం 'హలో' విడుదల దగ్గరవుతున్న వేళ, ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. ఈ సినిమా అఖిల్‌కి రీ లాంఛింగ్‌ మూవీగా చెప్పుకొస్తున్నారు. తొలి సినిమా అఖిల్‌ నిరాశ పరచడంతో ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఇక ప్రమోషన్‌ విషయమై అక్కినేని ఫ్యామిలీ జోరుగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తోంది. ఈ ప్రమోషన్స్‌లో భళ్లాలదేవ రానా కూడా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం రానా, అఖిల్‌ కలిసి అమెరికాలో సందడి చేస్తున్నారు. మొన్నీ మధ్యనే న్యూజెర్సీలో ప్రమోషన్స్‌ ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం డల్లాస్‌లో ఈ ఇద్దరూ సందడి చేస్తున్నారు. తమ సినిమా ప్రమోషన్స్‌కి వస్తున్న అభిమానులకు అఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా ధన్యవాదాలు చెప్పాడు. ప్రమోషన్స్‌లో భాగంగా అఖిల్‌ కొన్ని స్టేజ్‌ షోలు ఇస్తున్నాడు. స్టేజ్‌పై ఆడుతున్నాడు పాడుతున్నాడు. 

అఖిల్‌తో కలిసి రానా కూడా పిచ్చ పిచ్చగా సందడి చేస్తున్నాడు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున విసృతంగా 'హలో' ప్రమోషన్‌ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ సినిమాని నాగార్జున తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. ప్రోమోస్‌, ట్రైలర్‌కూ మంచి స్పందన వస్తోంది. అఖిల్‌ సినిమాకి ఓవర్సీస్‌లోనూ మంచి బిజినెస్‌ జరిగింది. దాంతో అక్కడ కూడా ఈ సినిమాపై అంచనాలున్నాయి. అమెరికాలో 167 లొకేషన్స్‌లో విడుదల చేస్తున్నారు 'హలో' సినిమా. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ అందించిన మ్యూజిక్‌ ప్లస్‌ పాయింట్‌ అని చెప్పాలి. ఆడియో బాగా ఆకట్టుకుంటోంది. 

టైటిల్‌ సాంగ్‌ ఇంకా బాగా రీచ్‌ అవుతోంది. టైటిల్‌ సాంగ్‌ ప్రోమోస్‌లో అఖిల్‌ వేసే చిన్న చిన్న స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా హార్ట్‌ టచ్చింగ్‌గా అనిపిస్తున్నాయి. ముద్దుగుమ్మ కళ్యాణీ ప్రియదర్శన్‌ 'హలో'తో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సినిమా 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS