ఈ సారి క్రిస్‌మస్‌కి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి నాని 'ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి' అయితే, రెండోది అఖిల్ రీ లాంఛింగ్ మూవీ 'హలో'. డిశంబర్ 21న 'ఎంసీఏ' రిలీజ్ అవుతుండగా, 22న 'హలో' రిలీజ్ అవుతోంది. రెండూ ఇంచుమించు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. సో ఇద్దరికీ హోరా హోరీ పోటీ జరగనుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆల్రెడీ నాని క్లారిటీ ఇచ్చేశాడు. ఈ క్రిస్‌మస్‌కి 'మిడిల్ క్లాస్ అబ్బాయి', 'టైగర్'కి 'హలో' చెప్తాడంటూ, ఇది అఖిల్‌కీ నాకూ మధ్య పోటీ కాదు అని సోషల్ మీడియాలో క్లారిటీగా చెప్పేశాడు.
తాజాగా ఈ విషయంలో నాగార్జున కూడా స్పందించాడు. సంక్రాంతికి ఒకేసారి నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయినా కానీ ధియేటర్స్‌కి ఏమాద్రం కొరత ఉండదు. వాటిలో చిన్న సినిమాలుంటాయి. పెద్ద సినిమాలుంటాయి. వేటి దారి వాటిదే. ఈ ఏడాది సంక్రాంతికి మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో రెండు పెద్ద సినిమాలున్నాయి. ఒక చిన్న సినిమా ఉంది. అలా అని చిన్న సినిమాకి ధియేటర్స్ కొరతేమీ లేదే. అలాగే ఇప్పుడు క్రిస్‌మస్‌కి రిలీజ్ కాబోయే సినిమాలకు కూడా సరిపడా ధియేటర్స్ ఉన్నాయి.
సో ఏమీ ప్రోబ్లమ్ లేదు. అయినా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' బడ్జెట్ వేరు, జోనర్ వేరు. 'హలో' జోనర్ వేరు, బడ్జెట్ వేరు. సో ఈ రెండింటికీ పోటీ కాదు. ఒకవేళ ఉన్నా కానీ అది ఆరోగ్యవంతమైన పోటీనే అవుతుంది అని నాగార్జున అన్నారు. నాగార్జున కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. ఆయన లెక్కలు ఆయనకుంటాయిలే మరి. 'హలో' సినిమాని నాగార్జున తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే దిల్ రాజు బ్యానర్‌లో వేణు శ్రీరామ్ 'ఎంసీఏ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.