'బీరువా' సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సురభి. 'జెంటిల్‌మేన్', 'ఎక్స్‌ప్రెస్‌రాజా' తదితర సినిమాలతో పాపులర్ అయ్యింది. తాజాగా అమ్మడు 'ఒక్క క్షణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా ఈ సినిమాలో సురభి కేవలం గ్లామర్ కోసమే కాకుండా నటనకి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌ని పోషిస్తోందట. అలాగే నటనలోనూ చాలా పరిణీతి సాధించిందంటున్నారు చిత్ర వర్గాలు. అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాని తెరకెక్కించిన వి.ఐ.ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. పేర్లల్ లైఫ్ అనే కొత్త కాన్సెప్ట్ ఏదో పరిచయం చేయనున్నాడు డైరెక్టర్ ఈ సినిమాతో. కాగా ఈ సినిమాలో శిరీష్‌కీ, ముద్దుగుమ్మ సురభికి మధ్య కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది ప్రచార చిత్రాలు చూస్తుంటే. ఫస్ట్‌లుక్‌లో కూడా ఈ ఇద్దరికీ బాడీ కాంటాక్ట్ బాగా ఉంది. అలాగే తాజాగా విడుదలైన మరో పోస్టర్ కూడా ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తోంది. చాలా చాలా హాట్‌గా కనిపిస్తోంది సురభి పోస్టర్ స్టిల్స్‌లో. సినిమాలోనూ రొమాన్స్ చాలా బాగా పండిందట ఈ ఇద్దరి మధ్యా. ఈ సినిమాలో మరో హాట్ బ్యూటీ సీరత్ కపూర్ కూడా నటిస్తోంది.
ఇంతవరకూ ఈ ముద్దుగుమ్మకి పోస్టర్స్‌లో చోటు దక్కలేదు. సీరత్ కపూర్ హాట్‌నెస్ గురించి మనకు తెలిసిందే. సురభికి ఏమాత్రం తక్కువ కాదండోయ్ ఈ బ్యూటీ. ఒకింత ఎక్కువే ఉంటుంది కానీ. కాగా మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని ఆడియో సింగిల్‌ని రేపు రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. టీజర్, పోస్టర్స్‌తో ఆశక్తిని క్రియేట్ చేసిన శిరీష్ మణిశర్మ మ్యూజిక్‌లో ఆడియో సింగిల్‌తోనూ మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి మరి.