లేట్ అయిన పర్లేదు కాని తప్పకుండా హిట్ కొట్టాలి అన్న తపనతో ఈమధ్యనే డైరెక్టర్ విక్రం కె కుమార్ తో కలిసి ఓ చిత్రాన్ని మొదలుపెట్టాడు.
ఇక ఇప్పటికే చిత్రంలోని యాక్షన్ పార్ట్ ని షూట్ చేసేసినట్టు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ ఎంపిక ఇంకా జరగాల్సిఉంది. యూనిట్ సభ్యులు మాత్రం కొత్త హీరోయిన్ ని తీసుకుందామని ఆలోచిస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక అయుదుగురిని స్క్రీన్ టెస్ట్ చేసినట్టు సమాచారం.
నాగార్జున మాత్రం ఈ సినిమాకి ఒక పక్కా తెలుగు టైటిల్ పెట్టాలని నిర్ణయించినట్టు ఫిలిం నగర్ వర్గాల టాక్. ఇప్పటికే అఖిల్ చేత కచ్చితంగా హిట్ కొట్టిస్తానని అక్కినేని అభిమానులకి హామీ కూడా ఇచ్చేశాడు నాగ్.