చలపతి రావు చేసిన కామెంట్ పైన నేటి ఉదయం నుండి ఖండనలు, నిరసనలు, ఫిర్యాదులు వ్యక్తమవుతున్న నేపధ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది.
ప్రెస్ మీట్ లో ప్రెసిడెంట్ శివాజీ రాజా & వైస్ ప్రెసిడెంట్- నరేష్ లు మాట్లాడుతూ- ఏదైతే ఆడియో రిలీజ్ వేడుకలో జరిగిందో దాన్ని మా అసోసియేషన్ తరపున ఖండిస్తున్నాము అని ప్రకటించారు. ఇక ఇలాంటివి పునరావృతం కాకుండా, త్వరలో జరగబోయే జనరల్ బాడీ మీటింగ్ లో ఇలాంటివి మున్ముందు జరిగితే తీసుకోవాల్సిన చర్యల పై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అదే సమయంలో చలపతిరావు ఇప్పటికే తను చేసిన కామెంట్ కి క్షమాపణ చెప్పిన నేపధ్యంలో ఇక ఈ విషయాన్ని మహిళ సంఘాల వారు పెద్ద మనసుతో క్షమించి ఇక్కడితో వదిలేయాలి అని విజ్ఞప్తి చేశారు. తాము కూడా ‘మా’ తరపున ఫిర్యాదు చేసిన వారితో మాట్లాడి ఒక పరిష్కారం వైపు ఈ అంశాన్ని తీసుకెళ్తామని తెలిపారు.