బొమ్మ‌రిల్లు + ప‌రుగు క‌లిస్తే....?

By iQlikMovies - May 25, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

బొమ్మ‌రిల్లు సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే ఆక‌ట్టుకున్నాడు భాస్కర్‌. ఆ విజ‌యంతో భాస్క‌ర్ కాస్త బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ అయిపోయాడు. తండ్రీ కొడుకుల ఎమోష‌న్ అనేస‌రికి ఇప్ప‌టికీ ఆ సినిమానే గుర్తొస్తుంది. ప‌రుగు కూడా మంచి విజ‌యాన్ని అందుకుంది. అందులో తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ రంగ‌రించాడు భాస్క‌ర్‌. ఇప్పుడు అఖిల్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కూడా తండ్రి పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంద‌ని తెలుస్తోంది. తండ్రి - కొడుకుల సెంటిమెంట్ కి ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ని మేళ‌వించాడ‌ట భాస్క‌ర్‌.

 

ఎప్ప‌టిలా ఈసారి కూడా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కి పెద్ద పీట వేశాడ‌ని, బొమ్మ‌రిల్లు, ప‌రుగు క‌లిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంద‌ని చిత్ర‌బృందం ధీమాగా చెబుతోంది. తండ్రి పాత్ర కోసం ఓ ప్ర‌ముఖ న‌టుడి పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. అత‌నెవ‌ర‌న్న‌ది తెలియాల్సివుంది. క‌థానాయిక విష‌యంలో ఇంకా ఓ స్ప‌ష్ట‌త రాలేదు. ఇప్ప‌టికే ప‌లు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. వాళ్ల‌లో ఎవ‌రిని ఎంపిక చేస్తారో చూడాలి. గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS