అఖిల్ రీ లాంఛింగ్ మూవీ 'హలో' టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌కి యూ ట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ టీజర్‌ని యూ ట్యూబ్ నుండి తొలగించేశారు. ఎందుకయ్యా అంటే కాపీ రైట్స్ ఉల్లంఘన అనే ఆరోపణలతో ఈ టీజర్‌ని యూ ట్యూబ్ నుండి తొలగించారట. ఈ వివాదంపై అక్కినేని బుల్లోడు అఖిల్ స్పందించాడు. ఈ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 80 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాంటిది ఈ టీజర్ విషయంలో ఎందుకింత రాద్ధాంతం జరుగుతోందో తెలియడం లేదు అని అఖిల్ స్పందించాడు.
ఈ టీజర్‌కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన రియల్లీ స్లో మోషన్ మ్యూజిక్ ధన్యవాదాలు తెలిపాడు అఖిల్. ఈ సంస్థతో కలిసి పని చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇదిలా ఉండగా, మరో పక్క మళ్లీ కొన్ని గంటల్లోనే టీజర్ యూ ట్యూబ్‌లో యాక్టివ్ అయ్యింది. దాంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అక్కినేని ఫ్మామిలీతో 'మనం' సినిమాని తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఈ సినిమాని తెరకిక్కిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగార్జున ఈ సినిమాని తన సొంత బ్యానర్‌లో రూపొందిస్తున్నారు.
అఖిల్‌కి తొలి సినిమా నిరాశ పరచడంతో ఈ సినిమాని రీ లాంఛింగ్ మూవీగా అభివర్ణిస్తున్నారు. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. టీజర్‌లో అఖిల్ సాహసాలు చూస్తుంటే, సినిమాపై అంచనాలు బాగున్నాయి. స్పైడర్ మ్యాన్‌లా ఈజీగా బిల్డింగ్స్ మీద నుండి కార్ల మీద నుండి అఖిల్ జంపింగ్స్ చేసేస్తున్నాడు. యాక్షన్ ఘట్టాలకు ప్రత్యేక ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో. అలాగే లవ్‌కీ ప్రాధాన్యత ఉంది. కళ్యాణీ ప్రియదర్శిని ఈ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోంది.