అఖిల్‌ దూకుడు మొదలెట్టేశాడు

మరిన్ని వార్తలు

అఖిల్‌ హీరోగా రీ లాంచ్‌ అవుతోన్న సినిమా 'హలో'. విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఫస్ట్‌లుక్స్‌తోనే ఎట్రాక్ట్‌ చేసిన 'హలో', టీజర్‌ వచ్చాక సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇదో యాక్షన్‌ లవ్‌స్టోరీ అని విక్రమ్‌ కుమార్‌ ముందుగా విడుదలైన ఫస్ట్‌లుక్స్‌తోనే సూచనలిచ్చేశాడు. ఇక టీజర్‌లో యాక్షన్‌ సన్నివేశాల్ని బాగా కట్‌ చేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో అఖిల్‌ చాలా ఈజ్‌తో యాక్ట్‌ చేస్తుంటాడు. తొలి సినిమా అఖిల్‌లోనే అది ప్రూవ్‌ అయ్యింది.

ఈ సినిమా కోసం కూడా యాక్షన్‌ సీక్వెన్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు టీజర్‌ చూస్తే అర్ధమవుతోంది. కళ్యాణీ ప్రియదర్శిని హీరోయిన్‌గా పరిచయం అవుతోంది ఈ సినిమాతో. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'ద లక్కీయెస్ట్‌ పీపుల్‌ బోర్న్‌ ఆన్‌ దిస్‌ ఎర్త్‌', వారు ఎవ్వరేం చేసినా, ఏం అడ్డు వచ్చినా వారి సోల్‌ మేట్‌ని కలుసుకుంటారు. లైఫ్‌ని షేర్‌ చేసుకుంటారు..' అంటూ నాగార్జున వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ స్టార్ట్‌ అవుతోంది. టీజర్‌లో అఖిల్‌ దూకుడు మామూలుగా లేదు. స్పైడర్‌మేన్‌లా ఆ బిల్డింగ్‌ మీద నుండి ఈ బిల్డింగ్‌ మీదికి, లారీల మీద నుండి, షాపింగ్‌ మాల్స్‌ పై ఫ్లోర్స్‌ నుండీ ఈజీగా దూకేస్తున్నాడు.

హీరోయిన్‌ కళ్యాణీ ప్రియదర్శని చాలా అందంగా కనిపిస్తోంది. క్యూట్‌ అండ్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలియవస్తోంది. టీజర్‌ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డిశంబర్‌ 22న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ పార్ట్‌ దాదాపుగా కంప్లీట్‌ అయ్యింది. విజువల్‌ వర్క్స్‌లో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది. అన్నపూర్ణా స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS