అక్కినేని అందగాడు అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న సెకండ్ మూవీ రిలీజ్‌కి నాగార్జున మంచి టైం ఫిక్స్ చేశాడు. అఖిల్ హీరోగా పరిచయమైన తొలి సినిమా 'అఖిల్' డిజాస్టర్ కావడంతో ఇప్పుడు రాబోయే సినిమానే అఖిల్ తొలి సినిమాగా లాంఛ్ చేయబోతున్నామని నాగార్జున చెప్పారు. అందుకే ఈ సినిమాని మంచి ముహూర్తంలో విడుదల చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నాడట. నాగార్జునకి డిశంబర్ బాగా కలిసొచ్చిన నెల. ఆ నెల్లో రిలీజైన నాగార్జున సినిమాకి తిరుగే ఉండదు. ఖచ్చితంగా హిట్టే. సో ఆ నెల్లోనే అఖిల్ సినిమాని విడుదల చేయబోతున్నామని నాగ్ తెలిపారు. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో అఖిల్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుంది. సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందట. అఖిల్‌ని 'మనం' సినిమా ద్వారా తొలిసారి కెమెరా ముందుకు తీసుకొచ్చిన విక్రమ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా చాలా బాగా చూపించబోతున్నాడట. ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. లవ్, యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తొలి సినిమాలో సినిమా పరాజయం పాలైనా కానీ, డాన్సులు, ఫైట్లు ఇరగదీసి హీరోగా అఖిల్ మంచి మార్కులే వేయించుకున్నాడు. ఈ సారి అయితే ఖచ్చితంగా సక్సెస్ కొట్టడానికే వస్తున్నట్లున్నాడు. నాగార్జున ఎంతో నమ్మకంతో అఖిల్‌ని విక్రమ్ చేతిలో పెట్టాడు. ఆ నమ్మకాన్ని విక్రమ్ నిలబెట్టుకుండాడనీ, అఖిల్‌కి మంచి హిట్ ఇస్తాడనీ ఆశిద్దాం.