కామెడీ 'అవసరాల' అని 'ఊరంతా అనుకుంటున్నారు'

మరిన్ని వార్తలు

'అష్టా చెమ్మా' సినిమాలో 'నందు'గా నవ్వులు పూయించిన నటుడు అవసరాల శ్రీనివాస్‌. మొదట్లో నటుడు మాత్రమే అనుకున్న ఆయనలో ఓ మంచి రచయిత, ఓ మంచి దర్శకుడు ఉన్నాడన్న సంగతి 'ఊహలు గుసగుసలాడే', 'జ్యోత అచ్చుతానంద' చిత్రాలతో ప్రూవ్‌ అయ్యింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించాడాయన. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మరికొన్ని చిత్రాలకు డైలాగ్స్‌ అందించాడు. ఇక ఇప్పుడు ఆయన కథానాయకుడుగా వస్తున్న చిత్రం 'ఊరంతా అనుకుంటున్నారు'.

 

ఈ సినిమాలో నవీన్‌ విజయ్‌ కృష్ణ ఇంకో హీరోగా నటిస్తున్నాడు. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు గౌరవమిచ్చే ప్రేమికుల కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ సినిమా. అవసరాల సినిమా అంటే కామెడీ ఖచ్చితంగా ఉంటుంది అని నమ్మి, ఆ కామెడీని ఎంజాయ్‌ చేయడానికే సినిమాకి వెళ్లాలనుకునేవాళ్లకి హండ్రెడ్‌ పర్సంట్‌ టికెట్‌ పైసా వసూల్‌ అనేలా ఈ సినిమా ఉండబోతోందట.

 

దసరా పండక్కి, హాయిగా, ఆహ్లాదంగా నవ్వుకోవాలంటే 'మా ఊరంతా అనుకుంటున్నారు' సినిమా చూడాలంటున్నాడీ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ అవసరాల శ్రీనివాస్‌. ఈ సినిమాతో పాటు, ఈయన మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. హిట్‌ కాంబినేషన్‌ నాగశౌర్యతో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే హీరోగా 'ఎన్నారై' సినిమాలో నటిస్తున్నాడు. తన స్నేహితుడు, కమ్‌ కో స్టార్‌ అయిన నేచురల్‌ స్టార్‌ నానితో దర్శకుడిగా ఓ సినిమా తెరకెక్కించాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS