50 రోజుల పాటు హౌస్‌లో ఉండి, తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ అలీ రెజా టాస్క్‌ల్లో తన పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో గతంలో చూశాం. చాలా అగ్రెసివ్‌గా పాల్గొంటాడు టాస్క్‌ల్లో. అయితే, రీ ఎంట్రీలో ఆ దూకుడు కాస్త తగ్గించాడనుకోవాలి. అయితే, తన ఆట మీద కన్నా, ఎదుటి వారి ఆట మీదనే ఎక్కువగా దృష్టి పెడుతుంటాడు అలీ రెజా.. అనే విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. 'బ్యాటిల్ ఆప్ ది మెడాలియన్' టాస్క్‌లో నీళ్లను తొట్టిలో నింపే ప్రక్రియలో భాగంగా కేటాయించిన తొట్టెల్లో బిగ్‌బాస్ సూచించిన వ్యక్తులు నీళ్లు నింపాలి.
మిగిలిన వ్యక్తులు వారిని అడ్డుకోవాలి. పునర్నవి ఈ టాస్క్‌కి సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే, అలీ తన తొట్టిలో కాకుండా శివజ్యోతి తొట్టెలో నీళ్లు నింపేశాడు. గతంలో ఇసక టాస్క్‌లో కూడా అలీ రెజా ఇదే తీరు ప్రదర్శించాడు. తప్పు చేసి, అప్పుడు కూడా ఇంటి సభ్యులతో తనదైన శైలిలో గొడవకు దిగాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు.
టాస్క్ నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావంటూ కెప్టెన్ శ్రీముఖి ఈ సారి ఆలీ రెజాని వదిలిపెట్టలేదు. సంచాలకురాలు పునర్నవి ద్వారా బిగ్‌బాస్‌కి ఈ విషయం కంప్లైంట్ చేయించింది. దాంతో బిగ్‌బాస్ నియయాల్ని ఉల్లంఘించిన కారణంగా అలీ రెజానీ, అతని సాయం పొందినందుకు శివజ్యోతిని ఆట నుండి తప్పించారు. ఇక ఈ టాస్క్‌లో ఎక్కువ నీళ్లు నింపినందుకు వితిక విజేతగా నిలిచింది.