అఖిల్‌ ప్రయోగం ఈ సారైనా ఫలిస్తుందా?

By Inkmantra - October 19, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

అక్కినేని అందగాడు అఖిల్‌ తొలి చిత్రానికే సాహసం చేశాడు. రెగ్యులర్‌ కమర్షియల్‌ లవ్‌ స్టోరీని ఎంచుకోకుండా, భారీ బడ్జెట్‌తో బీభత్సమైన యాక్షన్‌ విజువల్స్‌తో తెరకెక్కిన 'అఖిల్‌' సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా ఫుల్‌గా నెగిటివ్‌ రిజల్ట్‌ ఇచ్చింది అఖిల్‌కి. ఆ తర్వాత 'హలో' అంటూ డల్‌ లవ్‌ స్టోరీని ఎంచుకున్నాడు. అదీ ఆశించిన రిజల్ట్‌ ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత తెలిసిన సంగతే 'మిస్టర్‌ మజ్ను' అంటూ వచ్చి నిరాశపరిచాడు.

 

ఇక ఇప్పుడు ఇంకా టైటిల్‌ పెట్టలేదు. కానీ, బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా రొమాంటిక్‌ లవ్‌ స్టోరీనే. కానీ, ఈ సినిమాతో అఖిల్‌ని హీరోగా నిలబెట్టేందుకు భాస్కర్‌ చాలా కసరత్తులు చేస్తున్నాడట. 'బొమ్మరిల్లు' సినిమాలో సిద్దార్ద్‌ క్యారెక్టర్‌ మాదిరి ఫుల్‌ జోష్‌తో అఖిల్‌ క్యారెక్టర్‌ ఉండనుందట. అఖిల్‌ నుండి అభిమానులు కోరుకునేదే ఆ ఎనర్జీ. కరెక్ట్‌గా ఆ ఎనర్జీని మెయిన్‌ పాయింట్‌గా చేసుకుని భాస్కర్‌ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. సో ఈ సినిమాతో అఖిల్‌ సక్సెస్‌ సంగతి తేలిపోనుంది.

 

ఇదిలా ఉంటే, ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, అఖిల్‌ ఇంకో సినిమానీ లైన్‌లో పెట్టాడని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. తమిళ దర్శకుడు పి.యస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో ఓ కథ నాగార్జున చెంతకు వచ్చింది. అడ్వెంచర్స్‌తో కూడిన సినిమా అని తెలుస్తోంది. ఈ కథ అఖిల్‌కి బాగుంటుదని నాగార్జున లాక్‌ చేసి ఉంచాడట. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS