తెనాలి రామకృష్ణ' పక్కా నవ్వుల 'ఎక్స్‌ప్రెస్‌'.!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కెరీర్‌లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' చెప్పుకోదగ్గ హిట్‌ సినిమా. ఆ తర్వాత ఆ రేంజ్‌ హిట్‌ కోసం చాలా ప్రయత్నాలు చేశాడు మనోడు. కానీ, దక్కలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది 'నిను వీడని నీడను నేనే' సినిమాతో ఓ మోస్తరు హిట్‌ అందుకున్నాడు. ఇక త్వరలో 'తెనాలి రామకృష్ణ బిఎబిఎల్‌' సినిమాతో రానున్నాడు. క్వాలిఫికేషన్‌ చెప్పారు కదా అని ఇదేదో సీరియస్‌ మూవీ అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

 

అసలే ఈ సినిమాకి నవ్వుల దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సినిమాల్లో ఇంతవరకూ చూసిన కామెడీని మించిన కామెడీ ఈ సినిమాలో చూపించబోతున్నారట. పొట్ట చెక్కలేయ్యే కామెడీతో ఈ సినిమా రూపొందించారట. సినిమా ఖచ్చితంగా ఆడియన్స్‌ని మెప్పిస్తుందని అంటున్నారు. త్వరలో విడుదల కానుంది ఈ సినిమా. ముద్దుగుమ్మ హన్సిక ఈ సినిమాలో సందీప్‌కి జోడీగా నటిస్తోంది.

 

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇంతవరకూ ఆమె పాత్రని సీరియస్‌ విలన్‌గానూ, లేదంటే హుందా అయిన పాత్రల్లోనూ చూశాం. కానీ, ఈ సినిమాలో వరలక్ష్మి పాత్ర కొంచెం కొత్తగా ఉంటుందట. కామెడీ విలన్‌గా నటించబోతోందనీ సమాచారం. ఆల్రెడీ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ అయిన ఈ సినిమాని వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS