అఖిల్‌ని కరోనా బాగా డిజప్పాయింట్‌ చేసింది.. ఎందుకంటే!

మరిన్ని వార్తలు

హీరోగా పరిచయమై, ఇప్పటికే మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఇంతవరకూ ఒక్క సూపర్‌ హిట్‌ కూడా దక్కించుకోలేకపోయాడు అక్కినేని హీరో అఖిల్‌. ఇక నాలుగో సినిమా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’పై చాలా చాలా ఆశలు పెట్టుకున్నాడు. అన్నీ బావుంటే, ఈ వేసవికి మన బ్యాచిలర్‌ ప్రేక్షకు ముందుకొచ్చేవాడు. కానీ, ఈ సారి కరోనా రూపంలో అఖిల్‌కి పెద్ద దెబ్బ పడింది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా హాలీడేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

 

సమ్మర్‌ రిలీజ్‌ కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసుకుందట. అయితే, అనుకోకుండా కరోనా దాడికి బలైపోయింది. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో చక్కబడే ఛాన్సెస్‌ లేవు. సో అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ఎప్పుడు రిలీజ్‌కి నోచుకుంటుందో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే, ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్‌ చేసిన ‘మనసా మనసా మనసారా బతిమాలా.. తన వలలో పడబోకే మనసా..’ ఆడియో సాంగ్‌ సినిమాపై ఓ మోస్తరు అంచనాల్ని క్రియేట్‌ చేసింది. రిలీజ్‌ దగ్గర పడి ఉంటే, అదే జోష్‌తో ప్రమోషన్స్‌ని కంటిన్యూ చేసేవారు ‘బ్యాచిలర్‌’ టీమ్‌. సరె సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటీ.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS