'సైరా'లో అక్కినేని?

మరిన్ని వార్తలు

'సైరా' సినిమా చుట్టూ ఎన్నో గాసిప్స్‌ సంచరిస్తున్నాయి. వాటిల్లో ఎక్కువగా నెగెటివ్‌ గాసిప్స్‌ ఉంటున్నాయి. అవి కొంత వరకు నిజం అవుతున్నాయ్‌ కూడా. సంగీత దర్శకుడిగా తొలుత రెహమాన్‌ని అనుకున్నా, అతను తప్పుకుంటున్నాడనే గాసిప్స్‌ వచ్చాయి, ఆ గాసిప్స్‌ నిజమవడం ఆ తర్వాత రెహమాన్‌ స్వయంగా ఆ సినిమా తాను చేయడంలేదని చెప్పడం జరిగిపోయింది. 

అలాగే, సినిమాటోగ్రాఫర్‌ కూడా మారాడు. హీరోయిన్‌ మారిందనే గాసిప్స్‌ వచ్చినట్టే వచ్చిందిగానీ, అది తుప్పుమంది. డైరెక్టర్‌ మారాడన్న గాసిప్స్‌ ఇంకా షికార్లు చేస్తూనే ఉన్నాయి. వాటిని 'సైరా' యూనిట్‌ సభ్యుల సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. ఈ తతంగమంతా ఇలా ఉంటే, కొత్త గాసిప్‌ మార్కెట్‌లోకి వచ్చింది 'సైరా' గురించి. అది టూ హాట్‌ టూ హ్యాండిల్‌ అనేంతటి హాట్‌ గాసిప్‌. 'సైరా' సినిమాలో అక్కినేని హీరో కన్పించనున్నాడనేదే ఆ గాసిప్‌ సారాంశమట. అయితే ఇందులో పూర్తిగా క్లారిటీ లేదు. 

అక్కినేని నాగార్జున చేస్తాడా? ఇంకెవరైనా అక్కినేని కాంపౌండ్‌ నుంచి 'సైరా' సినిమా కోసం ఎంపిక చేయబడ్డారా? అన్న విషయాలు తేలాల్సి ఉంది. ఇలాంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలంటే నాగార్జున చాలా ఇంట్రెస్ట్‌ చూపే అవకాశం ఉంది. చిరంజీవి - నాగార్జున స్నేహం గురించి కూడా అందరికీ బాగా తెలుసు. 'పెదనాన్న' అంటూ అక్కినేని అఖిల్‌, చిరంజీవిపై తన అభిమానాన్ని ఇటీవలే 'హలో' సినిమా సందర్భంలో చాటుకున్నాడు. పెద్దన్నయ్య చరణ్‌ నిర్మిస్తున్న, పెదనాన్న మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సినిమాలో అఖిల్‌గానీ నటించట్లేదు కదా! 'సైరా' టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న సినిమా కావడంతో ఈ సినిమా చుట్టూ ఏ గాసిప్‌ వచ్చినా, ఆ గాసిప్‌ ఇచ్చే కిక్కే వేరప్పా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS