పవన్ కళ్యాణ్ ని సాయం అడుగుతున్న పూనమ్ కౌర్

మరిన్ని వార్తలు

నిన్న ఉదయం ప్రెస్ మీట్ పెట్టి నటి పూనం కౌర్ కి సంబంధించి 6 ప్రశ్నలు సంధించాడు మహేష్ కత్తి. అయితే ఈ ప్రశ్నలతో హీరో పవన్ కళ్యాణ్ అలాగే త్రివిక్రమ్ ని ముడిపెట్టడంతో ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది.

అయితే కొద్దిసేపటి క్రితం నటి పూనం కౌర్ ఈ విషయంలో తనకి సహాయం చేయమని పవన్ కళ్యాణ్ ని ట్విట్టర్ ద్వారా కోరింది. ఇదే సమయంలో ఎవరో రాజకీయాలకి తనని బలిచేయడం సరికాదు అని చెప్పడంతో పాటు వీలైతే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా కలిసి ఈ విషయం పైన చర్చించాలి అని అనుకుంటున్నట్టు తెలిపింది.



మరి ఈ విషయమై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలావుండగా ఈరోజు ఉదయం పూనం కౌర్ సోదరుడు ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ- కత్తి మహేష్ వేసిన ప్రశ్నల్లో ఏ ఒక్కటి నిజం కాదు అని తేల్చి చెప్పాడు.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS