అక్కినేని శత జయంతి ఉత్సవాలను వారసుడు నాగార్జున గ్రాండ్ గా ప్రారంభించిన సంగతి తెల్సిందే. ఇప్పడు మరో వినూత్న ప్లాన్ చేస్తున్నారు అక్కినేని కుటుంభం. అక్కినేని సినీ జీవితంలో అనేక క్లాసిక్ హిట్స్ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని సెలెక్ట్ చేసి తెలుగు ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ని కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శతజయంతి ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని, ఆ త్రీ డేస్ అక్కినేని ఫ్యాన్స్ కోసం సూపర్ హిట్ క్లాసిక్ మూవీస్ రీ రిలీజ్ చేయనున్నారు.
సినిమానే జీవితంగా బతికారు ఏయన్నార్, ఆయన సినిమా కోసం తపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. తన చివరి రోజుల్లో కూడా అక్కినేని సినిమాల్లో నటించారు. అంతటి సినిమా తపన ఉన్న ఏయన్నార్ ని మరొకసారి స్మరించుకుంటూ టాప్ 10 మూవీస్ ని సెప్టెంబర్ 20 నుంచి 22వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 25 సిటీల్లో రీ రిలీజ్ చేయనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ ల్లోనే కాకుండా మల్టీ ప్లెక్స్ ల్లో కూడా ఈ టాప్ 10 సినిమాలను రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు అక్కినేని ఫ్యామిలీ. ఇందుకోసం ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలైన ఐనాక్స్, పీవీఆర్ లతో చర్చలు జరిపినట్లు టాక్.
అయితే రీరిలీజ్ కి రెడీ అయిన టాప్ టెన్ మూవీస్ లిస్ట్ కూడా ఫైనల్ అయ్యింది. దేవదాసు, మాయాబజార్, మిస్సమ్మ, డాక్టర్ చక్రవర్తి, భార్యభర్తలు, గుండమ్మ కథ, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, సుడిగుండాలు తో పాటు అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన చివరి చిత్రం మనం కూడా ఉండటం విశేషం. శతజయంతి ఉత్సవాల సందర్భంగా అక్కినేని కూడా రీరిలీజ్ ట్రెండ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇక నుంచి పాతతరం హీరోల సినిమాలు కూడా రీరిలీజ్ కి నోచు కుంటాయేమో చూడాలి.
We are delighted that Sri Akkineni Nageswara Rao garu’s classic films are being brought to audience once again.
— Annapurna Studios (@AnnapurnaStdios) September 4, 2024
He was a true pioneer and visionary who established us, Annapurna Studios.
We thank Film Heritage Foundation and NFDC-National Film Archive of India for this… pic.twitter.com/4q4xvHYxEU