విశ్వనటుడు కమల్‌హాసన్ చిన్న కుమార్తై అక్షరా హాసన్ ఈ మధ్య హాట్ హాట్‌గా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఏదో సెన్సేషనల్ సినిమాలో నటించి, స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడం వల్ల వచ్చిన గుర్తింపు కాదిది. తనకు తెలియకుండా, తన ప్రైవేట్ పిక్స్ లీకయ్యాయి. ఈ సంగతి కూడా అందరికీ తెలిసిందే.
ఆ విషయమై గగ్గోలు పెట్టిన అక్షరాహాసన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఈ పిక్స్ లీకేజీ వెనకాల సైబర్ క్రైమ్ హస్తం ఉనట్లు గమనించిన పోలీస్ బాబాయ్‌లు ఆ దిశగా ఇన్వెస్టిగేట్ చేయగా, కొన్ని నిజాలు బయటికొచ్చాయి. అక్షరాహాసన్ గత నాలుగేళ్లుగా తనూజ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే ప్రస్తుతం ఆ ప్రేమ బ్రేకప్ అయ్యి, జస్ట్ ఫ్రెండ్‌షిప్‌గా హోల్డ్‌లో ఉందటలెండి. అయితే ఈ పిక్స్ ఆ తనూజ్ అనే వ్యక్తి ఫోన్ నుండి బయటికి వచ్చాయని పోలీసులు గుర్తించారు.
గతంలో వీరి మధ్య ప్రేమ పీక్స్‌లో ఉన్నప్పుడు అక్షరాహాసన్ తనకు ఆ పిక్స్ పంపిందనీ, అవి ఆ ఫోన్‌లో ఉండిపోయాయనీ, ఇప్పుడు తాను ఆ ఫోన్ వాడడం లేదనీ, అసలు ఆ ఫోన్ నుండి ఆ పిక్స్ ఎలా బయటికి వచ్చాయో తనకు తెలియదనీ తనూజ్ మొత్తుకుంటున్నాడు. ఈ దిశగా విచారణ జరుపుతున్న పోలీసులకు మరిన్ని ఆధారాలు లభిస్తే కానీ ఈ విషయం తేలేది కాదు.
నిజానికి సెలబ్రిటీస్‌కి ఇదేమంత పెద్ద విషయం కానప్పటికీ, తొందరపడి అక్షరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాబట్టి, చట్టం తన పని తాను చేసుకుపోవాలి కాబట్టి. చూద్దాం ఏం తేలుతుందో.!