అక్ష‌య్ కోపం ఖ‌రీదు.. అయిదు వంద‌ల కోట్లు

By iQlikMovies - November 20, 2020 - 17:02 PM IST

మరిన్ని వార్తలు

యాక్ష‌న్ హీరో అక్ష‌య్ కుమార్‌కి కోపం వ‌చ్చింది. ఆ కోపం ఖ‌రీదు అక్ష‌రాలా.. 5 వంద‌ల కోట్లు. వివ‌రాల్లోకి వెళ్తే...

 

ఇటీవ‌ల బాలీవుడ్ యువ హీరో సుశాం్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఆత్మ‌హ‌త్య ఎన్నో వివాదాలకు, ఇంకెన్నో ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మైంది. బాలీవుడ్ లో నెపోటిజం ఉంద‌ని, అందువ‌ల్లే సుశాంత్ సింగ్ చ‌నిపోయాడ‌ని అక్క‌డి మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది. కొన్ని యూ ట్యూబ్ ఛాన‌ళ్ల‌యితే కొంత‌మంది సెల‌బ్రెటీల‌ను టార్గెట్ చేస్తూ... వార్తా క‌థ‌నాలు ప్ర‌సారం చేసింది.

 

ఎఫ్‌.ఎఫ్ అనే ఓ యూ ట్యూబ్ ఛాన‌ల్ ఈ కేసులో అక్ష‌య్ కుమార్‌ని ఇరికించాల‌ని చూసింది. సుశాంత్ సింగ్ మ‌ర‌ణానికి అక్ష‌య్ కూడా ఓ కార‌ణ‌మ‌నే త‌ప్పుడు స‌మాచారాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. అంతేకాదు... ఎం.ఎస్‌.ధోనీ సినిమాని సుశాంత్ చేయ‌డం అప్ప‌ట్లో అక్ష‌య్ కుమార్‌కి ఇష్టం లేద‌ని, ఆ సినిమాని ఎలాగైనా అడ్డుకోవాల‌ని చూశాడ‌ని స్టోరీలు చేసింది. ఇవ‌న్నీ అక్ష‌య్ దృష్టికి వెళ్లాయి. త‌న ప‌రువుకి న‌ష్టం క‌లిగించేలా.. ఈ యూ ట్యూబ్ ఛాన‌ల్ వార్త‌లు ప్ర‌సారం చేసింద‌ని, మాన‌సికంగా క్షోభ‌కి గురి చేసినందుకు త‌న‌కు 500 కోట్ల న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించాల‌ని కోర్టు కెక్కాడు. ఇప్పుడు అదే టాక్ ఆఫ్ బాలీవుడ్ అయ్యింది. న్యాయ‌స్థానం ఈ కేసుని ఎలా తీసుకుంటుందో చూడాలి. ఒక వేళ అక్ష‌య్‌కు అనుకూలంగా తీర్పు వ‌స్తే.. చాలా ఛాన‌ళ్ల‌పై ఇలానే సెల‌బ్రెటీలు కోర్టుకెళ్లే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS