ఏ సినిమా అయినా అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయడం అత్యవసరం. మితిమీరిన బడ్జెట్ వల్లే.. కొన్ని సినిమాలు డింకీ కొట్టాయి. ఈ అనుభవం దాదాపుగా ప్రతీ నిర్మాతకీ ఎదురవుతుంటుంది. ఓ కాన్సెప్ట్‌ని నమ్ముకుని సినిమా తీయాలనుకున్నప్పుడు బట్జెట్ అదుపులో ఉండాల్సిందే. లేకపోతే ఏం అవుతుంది? అనడానికి `సవ్యసాచి` ఓ పెద్ద ఉదాహరణ.
నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు. మైత్రీ మూవీస్‌నిర్మించింది. నిజానికి ఈ కథని చైతూకి తొలుత చెప్పినప్పుడు `రూ.10 కోట్లతో సింపుల్‌గా తీసేద్దాం` అనుకున్నార్ట. ఆ తరవాతే ఈ ప్రాజెక్టు మైత్రీ మూవీస్ చేతికి వెళ్లింది. వాళ్లు ఈ సినిమాని రూ.25 నుంచి రూ.30 కోట్లలో పూర్తి చేద్దామనుకున్నారు. కానీ.. చివరికి ఈ సినిమా బడ్జెట్ రూ.35 కోట్లు దాటింది.
రీషూట్ల వల్ల సినిమా ఆలస్యమైందని, రీషూట్లకే రూ.2 నుంచి 3 కోట్ల వరకూ ఖర్చయిందని తెలుస్తోంది. రీషూట్ల వల్లే.. ఈ సినిమా ఆలస్యం అవుతూ వెళ్లింది. నిజానికి ముందే అనుకున్నట్టు రూ.10 కోట్లతో ఈ సినిమా ముగిసి ఉంటే గనుక.... సినిమా ఫలితంతో సంబంధం ఈపాటికే `సవ్యసాచి` లాభాల్లో ఉండేది. తొలి మూడు రోజుల్లో ఎంత వసూలు చేస్తుందనేదానిపైనే ఈసినిమా లాభ నష్టాల చిట్టా ఆధారపడి ఉంది.