పీవీ సింధు బయోపిక్‌లో బాలీవుడ్‌ కిలాడీ?

మరిన్ని వార్తలు

రీసెంట్‌గా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడా కారిణిగా పి.వి.సింధు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు సార్లు భారతదేశానికి గోల్డ్‌ మెడల్‌ సంపాదించడంలో విఫలమైన పి.వి.సింధు పట్టు వదలకుండా, ప్రయత్నిస్తూనే ఉంది. పట్టుదలతో సాధన చేసింది. ఎట్టకేలకు స్వర్ణం సాధించింది.

 

ఈ సందర్భంగా, రాజకీయ, సినీ ప్రముఖులు సింధును ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ ఆమెకు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, ఎప్పటి నుండో పి.వి.సింధు బయోపిక్‌ తెరక్కెనుందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పటికే బ్యాడ్మింటన్‌ క్రీడా కారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ తెరకెక్కుతోంది. బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌ బయోపిక్‌కి రంగం సిద్ధమవుతోంది. ఈ తరుణంలో పి.వి.సింధు బయోపిక్‌కీ కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 

ఈ బయోపిక్‌లో కోచ్‌ గోపీచంద్‌ పాత్రలో బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. విలక్షణ చిత్రాలను ఓకే చేయడంలో అక్షయ్‌ కుమార్‌ ముందుంటారు. అందులోనూ ప్రత్యేకత కలిగిన సపోర్టింగ్‌ రోల్స్‌లో నటించేందుకు ఆయన ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఒకవేళ పి.వి.సింధు బయోపిక్‌ తెరకెక్కడం నిజమే అయితే, అక్షయ్‌ కుమార్‌ ఖచ్చితంగా కోచ్‌ గోపీచంద్‌ పాత్రలో మెప్పించడం ఖాయమేనేమో. క్లారిటీగా తెలియాలంటే, ఇంకాస్త సమయం వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS