'కాంచన'లా మారిపోయిన 'పక్షిరాజా'!

By iQlikMovies - May 18, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

లారెన్స్‌ రాఘవ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'కాంచన' మూవీని హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. లారెన్స్‌ రాఘవ ఈ సినిమాకి దర్శకుడన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మధ్యనే సెట్స్‌ మీదికి వెళ్లిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని తాజాగా విడుదల చేశారు.

 

అమ్మాయి హావభావాలతో కళ్లకు కాజల్‌ దిద్దుకుంటున్న అక్షయ్‌ కుమార్‌ ఈ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. మెన్న 'రోబో 2.0' సినిమాతో పక్షిరాజాగా అలరించిన అక్షయ్‌ కుమార్‌ ఇప్పుడు ఈ సినిమా కోసం అచ్చు కాంచనలానే మారిపోయారు. ఈ సినిమాకి 'లక్ష్మీబాంబ్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. రీమేక్‌ అయినా, ఈ కథకు లారెన్స్‌ చాలా మార్పులు చేర్పులు చేశారట.

 

చక్కని కథగా ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నామని ఆయన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోగల సత్తా ఉన్న నటుడు అక్షయ్‌కుమార్‌. అలాంటి అక్షయ్‌కుమార్‌ ఇప్పుడు 'కాంచన'లా ఆడియన్స్‌ని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలిక. అక్షయ్‌ వంటి కమిటెడ్‌ స్టార్‌తో పని చేయడం చాలా సంతోషంగా ఉందని కైరా అద్వానీ తెలిపింది. ఈ సినిమాని 2020 జూన్‌ 5న విడుదల చేయనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS