గ్లామ్‌షాట్‌: ఊయల 'వల' వేసి, గ్లామర్‌తో చంపేసి!

మరిన్ని వార్తలు

అన్నీ ఉన్నా ఇంకేదో అన్నట్లుగా ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌కి లక్‌ కలిసి రావడం లేదు. ఎంతగా ప్రయత్నించినా, తగ్గ అవకాశాలు మాత్రం రావడం లేదు. తొలి సినిమాకే తనలోని నటిని నిద్రలేపి, తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగ్యా జైశ్వాల్‌. 'కంచె' సినిమాలో 'సీత' పాత్రకు ప్రగ్యాని తప్ప ఇంకో నటిని ఊహించుకోలేం. అయితే, అక్కడితో ఆగిపోకుండానే, ఈ ముద్దుగుమ్మ తనలోని గ్లామర్‌ యాంగిల్స్‌నీ అంచెలంచెలుగా చూపించేసింది.

 

ఒక్కో సినిమాకీ, ఒక్కో తరహాలో గ్లామర్‌ అప్పీల్‌ ఇస్తూ వచ్చింది. ఇటు ఫ్యామిలీ హీరోయిన్‌ అనిపించుకున్నా, అటు హాట్‌ హీరోయిన్‌ అనిపించుకున్నా అమ్మడికి వర్కవుట్‌ కాలేదు. దాంతో ఏమనుకుందో ఏమో కానీ, సోషల్‌ మీడియాని హీటెక్కించడమే పనిగా పెట్టుకుంది. ఆ హీటులో ఒక్కోసారి హద్దులు కూడా దాటేస్తోంది. అయితే, తాజాగా ప్రగ్యా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ సింప్లీ సూపర్బ్‌ అనిపిస్తోంది. వల ఊయలలో వైట్‌ అండ్‌ వైట్‌ కాస్ట్యూమ్‌లో అదిరిపోయే స్టైల్‌ ఇచ్చింది అందాల ప్రగ్యా జైశ్వాల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS