పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ ప్రజంట్ వరస ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు. మరో నాలుగేళ్ల వరకు ప్రభాస్ డైరీ ఫుల్ అనే చెప్పాలి. కల్కి తో త్వరలో ప్రక్షకుల్ని అలరించనున్నాడు. నెక్స్ట్ మారుతి డైరక్షన్ లో రాజా సాబ్ సినిమాతో ఈ ఏడాది చివరికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇవి కాక సలార్ పార్ట్ 2 షూట్ త్వరలో ఉంటుందని సమాచారం. వీటి తర వాత లవ్ స్టోరీల స్పెషలిస్ట్ హను రాఘవపూడితో ఒక సినిమా కమిట్ అయ్యాడు. కల్కి రాజా సాబ్ ల తరవాత యానిమల్ చిత్రంతో ఎన్నో వివాదాలకు, రికార్డ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన సందీప్ వంగతో స్పిరిట్ సినిమా చేయనున్నాడు. యానిమల్ మూవీ చూసిన యూత్ కి సందీప్ స్టైల్ బాగా నచ్చింది. అతడికి ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. నెక్స్ట్ సందీప్ సినిమా ప్రభాస్ తో అనగానే సినీప్రియుల్లో చాలా ఆసక్తి పెరిగింది.
సందీప్, ప్రభాస్ కాంబో అనగానే చాలా అంచనాలు మొదలయ్యాయి. సందీప్ సినిమాల్లో చూపించే హీరోయిజానికి ప్రభాస్ కటౌట్ పర్ఫెక్ట్ గా ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి. స్పిరిట్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే స్పిరిట్ కి చెందిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. అదేంటి అంటే స్పిరిట్ లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని సమాచారం. అయితే అక్షయ్ విలన్ గా నటిస్తున్నాడా? లేదా కీలక పాత్ర అని తెలియాల్సి ఉంది. సందీప్ ఇప్పటికే అక్షయ్ కుమార్ కి కథ చెప్పాడని, అక్షయ్ కూడా కథ నచ్చి ఓకే చేసాడని టాక్.
ఒక వేళ ఇదే నిజమైతే మరొక బాలీవుడ్ హీరో తెలుగు ప్రేక్షకులకి పరిచయం కానున్నట్టే. కీలక పాత్ర కంటే ప్రభాస్ కి విలన్ గా అక్షయ్ బాగుంటాడని, ఫాన్స్ ఆశిస్తున్నారు. బాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు సౌత్ లో విలన్స్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇప్పుడు అక్షయ్ కూడా అదే బాటలో వెళ్తాడా? అన్నది తెలియాల్సి ఉంది. స్పిరిట్ లో మిగతా నటీ నటుల గూర్చి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. సందీప్- ప్రభాస్ కాంబో హిట్ గ్యారంటీ అంటున్నారు సినీ ప్రియులు. వీరిద్దరి జర్నీ ప్రజంట్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. యానిమల్ తో సందీప్, సలార్ తో ప్రభాస్ బాక్సాఫీస్ లెక్కలు మార్చేసారు. అలాంటిది వీరిద్దరూ కలిస్తే ఇంకేమైనా ఉందా రికార్డ్లు బ్రేక్.