ఎన్టీఆర్ తరవాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఎన్టీఆర్ డైలాగ్స్ కి, డాన్స్ కి, ఫైట్స్ కి విపరీత మైన ఫాలోయింగ్ ఉంది. RRR తరవాత ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది అని తెలిసిన విషయమే.
దేవర తరవాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 లో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ యశ్ రాజ్ బ్యానర్ లో ఒక స్పై సినిమాలో కూడా సోలో హీరోగా కమిట్ అయినట్టు సమాచారం. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ పై ఉత్సాహంగా ఉన్న ఫాన్స్ కి ఇంకో గుడ్ న్యూస్ దొరికింది. ఒక ప్రముఖ ఓటిటి సంస్థ ఎన్టీఆర్ ని తమ ఛానెల్ లో ప్రసారమయ్యే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించమని అడిగినట్టు సమాచారం. ఇందుకోసం భారీ పారితోషికం ఆఫర్ చేసినట్టు టాక్. అంతే కాదు పార్ట్నర్ షిప్ కూడా ఆఫర్ చేసారని తెలుస్తుంది. ఎన్టీఆర్ నిర్ణయం ఏంటా అని అంతా ఎదురు చూస్తున్నారు.
ఎన్టీఆర్ కి హోస్ట్ గా చేయటం కొత్త కాదు. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలకు హోస్ట్ గా చేసి ఫుల్ మార్క్స్ సంపాదించాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి హోస్ట్ గా చేసే అవకాశం వచ్చింది. దీనితో ఎన్టీఆర్ రియాలిటీ షో కి హోస్ట్ వ్యవహరిస్తూ, బిజినెస్ మాన్ గా కూడా మారనున్నాడని ఫాన్స్, సన్నిహితులు సంతోష పడుతున్నారు.