అక్కినేని రాకుమారుడు మొదలెట్టేశాడు!

మరిన్ని వార్తలు

అఖిల్‌ నుండి వస్తోన్న తాజా చిత్రం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. బన్నీ వాసు, వాసు వర్మ జి.ఎ.2 పిక్చర్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించి చాలా కాలమే అయ్యింది. అయితే, రెగ్యులర్‌ షూటింగ్‌ కోసం ఎక్కువగానే టైం తీసుకున్నారు. అఖిల్‌ సరసన నటించబోయే హీరోయిన్‌ కోసమే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఇంత లేటయ్యిందనీ తాజా సమాచారమ్‌. అయినా ఇంకా హీరోయిన్‌ దొరకలేదు. వేట కొనసాగుతూనే ఉంది. కన్నడ భామ, క్రేజీ బ్యూటీ రష్మిక కోసం అఖిల్‌ ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం రష్మికా చాలా బిజీ.

 

ఇటు తెలుగులో సూపర్‌ స్టార్‌ 'సరిలేరు నీకెవ్వరు'తో పాటు, 'భీష్మ' తదితర చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు మాతృభాష కన్నడలోనూ ఆమె వరుస ప్రాజెక్టుల్లో నటిస్తోంది. తెలుగులో 'డియర్‌ కామ్రేడ్‌' విడుదల దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటోంది. ఇన్ని బిజీ షెడ్యూల్స్‌ నడుమ ఆమె డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతోనే హీరోయిన్‌ పేరు సందిగ్థంలో పడిందట. అయినా, అఖిల్‌కి రష్మిక చిక్కుతుందో లేదో ఇప్పటికీ సస్పెన్సే అంటున్నారు. ఇదిలా ఉంటే, అఖిల్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆమె మరెవరో కాదు, క్యూట్‌ అండ్‌ నాటీ గాళ్‌ అలియాభట్‌.

 

అలియా ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో చరణ్‌కి జోడీగా నటిస్తోంది. అఖిల్‌ కోసం కూడా అలియాని గట్టిగానే ట్రై చేస్తున్నారట. మరి ఈ అక్కినేని రాకుమారుడి కోసం రానున్న ఆ రాకుమారి ఎవరో.? అలియా వస్తుందా.? రష్మికా చిక్కుతుందా.? లేక ఇంకెవరైనా కొత్త భామ తెరంగేట్రం చేస్తుందా చూడాలిక. ఇదిలా ఉంటే, రెగ్యులర్‌ షూటింగ్‌ని మరింత డిలే చేయడం భావ్యం కాదని, లేటెస్ట్‌గా షూటింగ్‌ స్టార్ట్‌ చేశారట. హీరోయిన్‌ వేట ఓ వైపు కొనసాగుతూనే, అఖిల్‌పై ఇంపార్టెంట్‌ సీన్స్‌ చిత్రీకరణను మొదలెట్టేశారనీ తెలుస్తోంది. హైద్రాబాద్‌ శివారు ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ జరుగుతోందనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS