'గ్యాంగ్‌ లీడర్‌' రివేంజ్‌ ఎవరి మీద?

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న 'గ్యాంగ్‌లీడర్‌' చిత్రం 'ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ప్రీ లుక్‌లో చూపించిన ఐదు చేతులు ఎవరెవరివో ఈ ఫస్ట్‌లుక్‌లో తెలిసింది. ఐదు డిఫరెంట్‌ జనరేషన్స్‌కి చెందిన ఆడవాళ్ల చేతులవి. ఇక ఫస్ట్‌లుక్‌లో 'రివేంజర్స్‌ అసెంబుల్‌' అంటూ ఐదుగురు లేడీస్‌తో పాటు నాని.. అందరూ బైనాక్యులర్స్‌ ధరించి కనిపిస్తున్నారు. బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను అంటూ వారి పేర్లు కూడా పరిచయం చేశారు.

 

వారందరి మధ్యలో నాని కూడా బైనాక్యులర్‌ పట్టుకుని సీరియస్‌గా కనిపిస్తున్నాడు. రివెంజర్స్‌ అసెంబుల్‌ అంటూ విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్‌ని బట్టి, వీరందరూ ఓ వ్యక్తిపై రివేంజ్‌ తీర్చుకోవాలనుకుంటా.. ఆ వ్యక్తి ఎవరు.? అసలింతకీ ఈ ఐదుగురికీ ఉన్న రిలేషన్‌ ఏంటీ.? అనే కథా, కమామిషు తెలియాలంటే టీజర్‌ వరకూ ఎదురు చూడాల్సిందే. టీజర్‌ కోసం పెద్దగా వెయిట్‌ చేయనక్కర్లేదనుకోండి.

 

జస్ట్‌ 24 వరకూ మాత్రమే వెయిట్‌ చేయాలి. మధ్యలో 18న 'గ్యాంగ్‌లీడర్‌' సాంగ్‌ రిలీజ్‌ చేయనున్నారు. ఈ సాంగ్‌కి సంబంధించి ప్రోమో ఎలా రిలీజ్‌ చేస్తారో చూడాలిక. మొత్తానికి నాని ఫస్ట్‌లుక్‌తో ఆశక్తి పెంచేశాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో రూపొందుతోంది. అన్నట్లు రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారండోయ్‌. ఆగస్ట్‌ 30న మన 'గ్యాంగ్‌లీడర్‌' ప్రేక్షకుల్ని అలరించనున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS