మన్నధుడి టెన్షన్‌ అందుకేనా?

మరిన్ని వార్తలు

నాగార్జునకు ఇప్పుడు బరువు బాధ్యతలు చాలా పెరిగాయని చెప్పక తప్పదు. ఓ పక్క ఆయన నటిస్తున్న 'మన్మధుడు 2' చిత్రం సంగతులు చూసుకోవాలి. మరోవైపు 'బిగ్‌బాస్‌ 3' హోస్టింగ్‌ కోసం కసరత్తులు చేయాలి. ఇంకోవైపు తండ్రిగా తన కొడుకుల సినిమా బాధ్యతలు కూడా నాగార్జునవే. ఇవన్నీ ఒకెత్తు అయితే, బిజినెస్‌ బాధ్యతలు ఆయనకి ఎప్పుడూ ఉండేవే. ఇలా ఇన్ని బాధ్యతల నడుమ నాగార్జున ఇంతకు ముందెన్నడూ లేని టెన్షన్‌ ఫీలవుతున్నారట.

 

వీటిలో ముఖ్యంగా టెన్షన్‌ పెడుతున్నది బుల్లితెరపై త్వరలో ప్రసారం కానున్న 'బిగ్‌బాస్‌' షో అనీ తెలుస్తోంది. ఎందుకంటే, నాగార్జున ప్రజెంట్‌ ఉన్న సిట్యువేషన్స్‌లో 'బిగ్‌బాస్‌ 3'కి హోస్ట్‌గా వ్యవహరించడమనేది కత్తి మీద సామే అని చెప్పాలి. ఎందుకంటే, బిగ్‌బాస్‌ షోకి హోస్ట్‌గా సోషల్‌ మీడియాలో బోలెడంత నెగిటివిటీని ఫేస్‌ చేయాలి. గతంలో నానిది ఇదే పరిస్థితి. ఆయన బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ఉన్న సమయంలోనే 'దేవదాస్‌' సినిమా విడుదలైంది. ఆ సినిమా విడుదల కోసం నాని అనుభవించిన టెన్షన్‌ అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో నానిని ఏకి పారేసేవారు. చిన్న తప్పు చేసినా, లాగి పారేసేవారు నెటిజన్లు.

 

అలాగే ఇప్పుడు నాగార్జునను కూడా వదిలిపెట్టరనిపిస్తోంది. అందులోనూ 'మన్మధుడు 2'కి ఇప్పటికే బోలెడన్ని కాంట్రవర్సీలు చుట్టుముట్టేశాయి. మరోవైపు కోడలు సమంత కారణంగా కూడా టెన్షన్‌ స్టార్ట్‌ అయ్యిందట నాగ్‌కి. సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌కీ, గాయని చిన్మయికీ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో సమంత జోక్యం కల్పించుకోవడమే అందుకు కారణం. 'మన్మధుడు 2'లో సమంత గెస్ట్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. సో ఈ కాంట్రవర్సీ ఖచ్చితంగా నాగ్‌ మెడకు చుట్టుకోకుండా ఉండదు. ఇన్ని టెన్షన్స్‌ నాగ్‌కి ప్రశాంతత లేకుండా చేస్తున్నాయట. మన్మధుడిగా లేటు వయసులోనూ అమ్మాయిల్ని భలే మ్యానేజ్‌ చేస్తున్న నాగ్‌, ఈ తలకు మించిన భారాన్ని ఎలా మ్యానేజ్‌ చేయగలడో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS