'అల వైకుంఠపురములో' ఆగమాగం!

By Inkmantra - October 23, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

ఆశ పెట్టి నిరాశ పరిచారంటూ ఆగ్రహం చెందిన అభిమానులకు అల్లు అర్జున్‌ ట్రీట్‌ ఇచ్చేశాడు. అనుకున్న టైం కన్నా ఒకరోజు లేట్‌గా విడుదలైన సాంగ్‌ ప్రోమో, లేటెస్ట్‌గా ఆకట్టుకుంటోంది. 'రాములో రాములా..' అంటూ సాగే ఈ పార్టీ సాంగ్‌లో అల్లు అర్జున్‌, పూజా హెగ్దే ఇద్దరూ కనిపించారు. జోష్‌గా డాన్సులు చేస్తున్నారు. అయితే, చిన్న బిట్‌ మాత్రమే రిలీజ్‌ చేసిన ఈ సాంగ్‌కి ఫుల్‌ వెర్షన్‌ 26వ తేదీన రానుంది.

 

ఇంతవరకూ విడుదలైన ఫస్ట్‌ ఆడియో సింగిల్‌ 'సామజవరగమన..' మెలోడియస్‌గా ఉర్రూతలూగిస్తోంది. ఇక ఈ రెండో సాంగ్‌ విషయానికి వస్తే, మాస్‌ సాంగ్‌లా అనిపిస్తోంది. కానీ, విజువల్‌ క్లాస్‌గా కనిపిస్తోంది. బన్నీ లుక్‌ డిఫరెంట్‌గా ఉంది. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

 

సంక్రాంతికి సినిమాని విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే, సినిమా విషయానికి వస్తే, 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' తరహా హిట్‌ కొట్టాలన్నది త్రివిక్రమ్‌ టార్గెట్‌. సో ఆ రేంజ్‌కి మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఈ సినిమాలో నిక్షిప్తం చేశాడట. పండక్కి ఫుల్‌ ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌గా 'అల వైకుంఠపురములో..' అలరించనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS