15 మంది కంటెస్టెంట్స్‌తో స్టార్ట్ అయిన బిగ్‌బాస్ రియాల్టీ షోలో మొదట్నుంచీ కాస్త మొహమాటస్థుడు రాహుల్ సిప్లిగంజ్. ఆడవాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు. ఫ్రెండ్స్ కోసం త్యాగాలు చేసేవాడు. అలాంటిది, క్లైమాక్స్‌కి వచ్చాక, రాహుల్ గేమ్ స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది. మనిషిలోనూ చాలా మార్పు వచ్చింది. టాస్క్‌ల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. పూర్తి అఫర్ట్ పెడుతున్నాడు. విజయం సాధిస్తున్నాడు కూడా. ఇక లేటెస్ట్‌గా ఫినాలే టికెట్ కోసం రాహుల్ రెండు సార్లు టాస్క్‌ల్లో పాల్గొనాల్సి వచ్చింది.
వరుణ్‌తో ఒకసారి, శ్రీముఖితో రెండోసారి. ఈ రెండు టాస్క్‌ల్లోనూ రాహుల్ విజయం సాధించాడు. దాంతో, తన బ్యాటరీని అత్యధిక స్థాయిలో అంటే 60 శాతం రీ ఫిల్ చేసుకుని టికెట్ టు ఫినాలేకి చేరిన మొదటి కంటెస్టెంట్‌గా ఈ సీజన్‌కి రికార్డు సాధించాడు. నిజానికి ఈ టికెట్ అలీ రెజాని వరించాల్సి ఉంది. మొదట్నుంచీ ఎక్కువ పర్సంటేజ్ బ్యాటరీ బ్యాక్ అప్‌తో ఉన్నాడు అలీ రెజా.
కానీ, బాబాతో చేసిన మడ్ పిట్ టాస్క్‌లో ఓవరాక్షన్ చేసి, జీరో పర్సంటేజ్‌కి చేరుకున్నాడు. దాంతో వెనక స్థానంలో ఉన్న రాహుల్ సిప్లిగంజ్ ముందుకు వచ్చి, టికెట్ గెలుచుకున్నాడు. రాహుల్ ఫినాలే టికెట్ గెలుచుకోవడం, శ్రీముఖి తదితర హౌస్ మేట్స్‌కి కాస్త కష్టంగా తోచినట్లు కనిపించినా, జెన్యూన్‌గా గేమ్ ఆడినందుకు రాహుల్‌కి ఫలితం దక్కిందని ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.