'అల వైకుంఠపురములో..' డే వన్ నుండీ ప్రమోషన్స్ హోరెత్తిస్తూనే ఉన్నారు. సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ, సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూనే వచ్చారు. ఇక సినిమా విడుదలకు దగ్గరైన తరుణంలో ఒక్కో పాటనీ రిలీజ్ చేస్తూ పండగ వాతావరణం కల్పించారు. ప్రతీ పాట ఓ అద్భుతంగా తీర్చిదిద్దారు. వాటిని ప్రమోట్ చేసిన సరికొత్త విధానానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆఖరికి మేకింగ్ వీడియోలు కూడా అదిరిపోయేలా డిజైన్ చేశారు.
ఇక రిలీజ్ చేసిన ఒక్కో పోస్టర్ నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అనేలానే ఉన్నాయి. ఏ పోస్టర్‌కి ఆ పోస్టరే సరిలేదు.. సాటి కాదు.. అనేలా ఉన్నాయి. లేటెస్ట్గా మరో పిక్ వదిలారు 'అల..' టీమ్. ఆ పిక్‌లో పూజాహెగ్దే - అల్లు అర్జున్, సుశాంత్ - నివేదా పేతురాజ్ పెయిర్స్ చూడముచ్చటగా ఉన్నాయి. చాలా హోమ్లీగా ఆకట్టుకుంటున్నాయి. ఫోటోషాప్ అద్భుతంగా కుదిరింది ఈ ఫోటోకి. సోషల్ మీడియాలో ఇప్పుడీ ఫోటో వైరల్ అవుతోంది. సుశాంత్ భుజంపై తల వాల్చి నివేదా పేతురాజ్ పోజివ్వగా, బన్నీని ఆప్యాయంగా కౌగిలించుకున్న పూజా హెగ్దే టోటల్లీ ఫ్యామిలీ హోమ్లీ పిక్లా ప్లెజెంట్‌గా ఉంది. 'అల..' ప్రమోషన్స్‌లో ఈ పిక్ ఫ్యాన్స్‌కి బాగా ఎక్కేస్తోందిలా.