'అల..' ఆ లెక్కలు వేరుగా ఉన్నాయిలా.!

By Inkmantra - January 11, 2020 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఎప్పుడూ ఓ గొప్ప మాట చెబుతాడు. సినిమా ఎంత గొప్పగా తీశాడో అనే దాని కన్నా, ఆయన మాటల్లోని మాయకే జనం ఎక్కువ ఫిదా అయిపోతుంటారు. ఈ సంక్రాంతికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన 'అల వైకుంఠపురములో..' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. కానీ, ఆ పోటీని పోటీ అనుకోవడం లేదని త్రివిక్రమ్‌ చెబుతున్నాడు. 'సరిలేరు..' జోనర్‌ వేరు. మా జోనర్‌ వేరు. అయినా సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా ఎలాంటి ప్రాబ్లెమ్‌ ఉండదు.

 

ఈ సీజన్‌కి ఎన్ని సినిమాలనైనా తట్టుకునే సామర్ధ్యం ఉంది. సో ఏ సినిమా అయినా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించాలన్నదే మా కోరిక. ఇకపోతే, నేను లెక్కలేసుకుని ఎప్పుడూ సినిమా చేయను. కాంబినేషన్లు అస్సలు ఇష్టపడను.. కథ అనుకున్నప్పుడే ఆ కథకి ఏ హీరో సూటవుతాడో ఆ హీరో దగ్గరికి వెళతాను..' అని 'అల వైకుంఠపురములో..' ప్రమోషన్స్‌లో త్రివిక్రమ్‌ చెప్పారు. రేపు అనగా జనవరి 12న 'అల వైకుంఠపురములో..' సినిమా భారీ ఎత్తున వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించింది. టబు కీలక పాత్ర పోషించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS