స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాంబో ట్రాక్‌లో వచ్చిన 'సామజవరగమనా..' సాంగ్ సౌత్‌లో ఎక్కువ మంది వీక్షించిన సాంగ్‌గా రికార్డుకెక్కింది. ఇప్పుడీ సాంగ్ విజువల్ కూడా అంతకు మించి రేంజ్లో ఉండేలా చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ప్యారిస్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ వేదిక కానున్నాయట. త్వరలోనే ప్యారిస్‌లో బన్నీ అండ్ టీమ్ ఈ పాట చిత్రీకరణ కోసం సిద్ధం కానుందట. హీరో బన్నీ, హీరోయిన్ పూజా హెగ్దే మధ్య ఈ రొమాంటిక్ సాంగ్‌ని అత్యద్భుతంగా చిత్రీకరించనున్నారట. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ, త్రివిక్రమ్ అండ్ టీమ్ రెండు పోస్టర్స్‌ని రిలీజ్ చేశారు. ఒక పోస్టర్లో బన్నీ, ముని వేళ్లపై నిలబడి, గ్రేస్‌ఫుల్‌గా ఓ స్టెప్ వేస్తూ కనిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్‌లోని గ్రీనరీ ఆహ్లాదమైన అనుభూతినిస్తోంది.
#Samajavaragamana ♥️♥️@alluarjun #Trivikram @hegdepooja @MusicThaman #Tabu #Jayaram #NivethaPethuraj @iamSushanthA @pnavdeep26 @Mee_Sunil #PSVinod @GeethaArts @vamsi84 @adityamusic pic.twitter.com/oCCa1HpLfw
— Haarika & Hassine Creations (@haarikahassine) November 8, 2019
మరో పోస్టర్లో మాస్ అండ్ యాక్షన్ మోడ్‌లో వేగంగా రన్ చేసుకుంటూ వస్తున్నాడు. రొమాంటిక్ అండ్ యాక్షన్.. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌ని ఒకేసారి రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి కొత్త కిక్ ఇచ్చాడు బన్నీ. ఈ సినిమాకి సంక్రాంతికి విడుదల కానుంది. అయితే, ముందుగా అనుకున్న డేట్లో కొంచెం అటూ ఇటూ అడ్జస్ట్మెంట్స్ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, ఈ సినిమాని కేరళలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. బన్నీకి మలయాళంలో సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతుంటాయి అక్కడ బన్నీ సినిమాలు.