కొన్ని సినిమాలు అంతే.. విడుదలకు ముందు, విడుదలయ్యాక.. సంచలనాలు కొనసాగుతూనే వుంటాయి. ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరో.. అత్యద్భముతమైన కాబో.. అయినాగానీ, ‘అల వైకుంఠపురములో’ అంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. అలా జరిగిపోయిందంతే. పాటలు, విడదలకు ముందూ సంచలనమే, విడుదలయ్యాకా సంచలనమే.
ఇప్పటికీ ‘అల వైకుంఠపురములో’ పాటలు సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే వున్నాయంటే, ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా చిత్ర యూనిట్, రీ-యూనియన్ ఏర్పాటు చేసింది. నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరిగ్గా ఏడాది క్రితం ‘అల వైకుంఠపురములో’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అల్లు అర్జన్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే ‘అల వైకుంఠపురములో’ తనదైన ప్రత్యేకతను చాటుకుందన్న చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది.
మరీ అంత గొప్ప కథాంశం ఏమీ కాకపోయినా, పాటలు.. సహా అన్ని అంశాలూ సినిమాకి అలా కలిసొచ్చేశాయంతే. 2020లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా ‘అల వైకుంఠపురములో’ సినిమా నిలిచిన విషయం విదితమే. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. సుమంత్, నివేదా పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.