అన్నపూర్ణ స్టూడియోలో బన్నీ 'వైకుంఠపురం'.

మరిన్ని వార్తలు

బన్నీ తాజా చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'అల వైకుంఠపురములో' అనే క్లాసిక్‌ టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ టైటిల్‌కే ఫ్యాన్స్‌ నుండి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇక ఈ టైటిల్‌ని జస్టిఫై చేసేలా ఈ సినిమాలో విజువల్స్‌ వుండబోతున్నాయట. అందుకోసం ఓ భారీ సెట్‌ని నిర్మిస్తున్నారట. దాదాపు 4.5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో అన్నపూర్ణ స్టూడియోలో ఈ భారీ సెట్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

ఈ సెట్‌లోనే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ ట్రాక్‌, కీలక పాత్రధారి అయిన టబుపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇక్కడ జరగనుందట. ఇటీవలే తొలి షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకున్న 'అల వైకుంఠపురములో' తాజా షెడ్యూల్‌ సెప్టెంబర్‌ నుండి జరగనుందట. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్‌ లోగోతో పాటు విడుదల చేసిన కొన్ని సెకన్ల వీడియోలో తనపై తానే డైలాగ్‌ వేసేసుకున్నాడు అల్లు అర్జున్‌.

 

పల్లెటూరి కుర్రాడి పాత్రలో మెడలో తుండు, నార్మల్‌ హెయిర్‌ స్టైల్‌ (కొంచెం పొడుగాటి జుట్టు)తో కనిపించాడు ఈ వీడియోలో బన్నీ. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. యంగ్‌ హీరో నవదీప్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడన్న టాక్‌ ఉంది. అక్కినేని హీరో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS