'సైరా' టీజర్‌ వచ్చేసింది.

మరిన్ని వార్తలు

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సైరా నరసింహారెడ్డి' టీజర్‌ వచ్చేసింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌తో స్టార్ట్‌ అయిన ఈ టీజర్‌ ఆథ్యంతం కట్టిపడేసేలా ఉంది. విజువల్స్‌ కళ్లు చెదిరిపోతున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి నట విశ్వరూపం అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది. 'చరిత్రలో మనం ఉండకపోవచ్చు.. కానీ, చరిత్ర మనతోనే మొదలవ్వాలి..' అంటూ పవర్‌ ఫుల్‌గా చిరంజీవి చెబుతున్న డైలాగ్‌ ఫ్యాన్స్‌కి కడుపు నింపేసేలా ఉంది. విజువల్స్‌ చూస్తుంటే, పెట్టిన ఖర్చు అంతా కనిపిస్తోంది.

టీజర్‌కి పవన్‌ కళ్యాణ్‌ వాయిస్‌ ఓ హైలైట్‌ అయ్యింది. కీలక పాత్రధారులందరికీ టీజర్‌లోనూ చోటు దక్కింది. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ ఇలా అందరినీ ఈ టీజర్‌లో చూపించారు. సింహాంలాంటోడు, అంటూ ఆంగ్ల సైనికులతో చెప్పించిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మరుగున పడిపోయిన తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు జీవిత గాధగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రామ్‌ చరణ్‌ ఈ సినిమాని నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి సురేందర్‌ రెడ్డి దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS