స్టైలిష్‌ స్టార్‌ 'ట్రీట్‌ ఎప్పుడంటే?

మరిన్ని వార్తలు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తాజా చిత్రం 'అల వైకుంఠపురము'లో సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్‌లుక్‌ టీజర్‌ తప్ప, మరో సమాచారం లేదింతవరకూ. రక్షా బంధన్‌ సందర్భంగా ఈ ఫస్ట్‌లుక్‌ ప్రోమో విడుదలైంది. చాలా గ్యాప్‌ వచ్చేసింది. సో అల్లు అర్జున్‌ నుండి మరో సర్‌ప్రైజ్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. నిజానికి వినాయక చవితికే ఏదో ఒక సర్‌ప్రైజ్‌ వస్తుందని ఆశించారు ఫ్యాన్స్‌.

 

కానీ, రాలేదు. ఇక ఇప్పుడు దసరా వస్తోంది. దసరాకైనా అల్లు అర్జున్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తాడా? అంటే ఖచ్చితంగా ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతోంది. దసరాకి 'అల వైకుంఠపురములో' నుండి అదిరిపోయే టీజర్‌ని ప్లాన్‌ చేస్తున్నారట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. 'డీజె' తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.

 

ప్రతీ ఫ్రేమ్‌లోనూ త్రివిక్రమ్‌ పంచ్‌ డైలాగులు ఫ్యాన్స్‌కి నవ్వుల పంట పండించేయనున్నాయట. 'జులాయి' రేంజ్‌ ని ఈ సినిమాకి ఊహిస్తున్నారు. సీనియర్‌ నటి టబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా, యంగ్‌ హీరో సుశాంత్‌ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. హ్యాండ్‌సమ్‌ హీరో నవదీప్‌ ఈ సినిమాలో కొత్త అవతారంలో కనిపించనున్నాడనీ, అది నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రనీ తెలుస్తోంది. హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌తో కలిసి అల్లు అరవింద్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సంక్రాంతి గ్రాండ్‌ రిలీజ్‌కి స్లాట్‌ బుక్‌ చేసుకుంది 'అల వైకుంఠపురములో'.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS