మాటల మాంత్రికా.. మళ్లీ అదే సెంటిమెంటా.?

మరిన్ని వార్తలు

'అత్తారింటికి దారేది..' తో స్టార్ట్‌ అయిన త్రివిక్రమ్‌ 'అ' సెంటిమెంట్‌ టైటిల్స్‌ని ఇంకా వదిలేలా కనిపించడం లేదు. అత్తారింటికి దారేది.. తర్వాత 'అ,ఆ..', 'అజ్ఞాతవాసి', 'అరవింత సమేత..' ఇలా వరుసగా నాలుగు సినిమాలకూ 'అ'తో స్టార్టయ్యే టైటిల్స్‌నే యూజ్‌ చేశాడు త్రివిక్రమ్‌.

 

ఇప్పుడు బన్నీ మూవీ కోసం కూడా అదే సెంటిమెంట్‌ ఫాలో చేయాలనుకుంటున్నాడట. ఇంతవరకూ 'నాన్న - నేను' అనే టైటిల్‌ ఈ సినిమాకి ప్రచారంలో ఉంది. అయితే లేటెస్ట్‌గా మరో కొత్త టైటిల్‌ తెరపైకి వచ్చింది. అదే 'అలకనంద'. 'అరవింద సమేత..'లో అరవింద అంటే హీరోయిన్‌ పేరు. కానీ ఈ సినిమాలో అలకనంద అంటే హీరోయిన్‌ కాదట. హీరో తల్లి పాత్ర పేరట. ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో సీనియర్‌ నటి టబు నటిస్తున్న సంగతి తెలిసిందే. సహజంగానే త్రివిక్రమ్‌ తన సినిమాల్లో సీనియర్‌ నటీమణుల పాత్రల్ని స్ట్రాంగ్‌గా డిజైన్‌ చేస్తాడు. నదియా, ఖుష్బూ, తదితర పాత్రల్ని తీసుకుంటే ఆ విషయం అర్ధమవుతుంది. అలాగే ఇప్పుడు కూడా టబు పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేశాడట. ఈ పాత్రకు కనెక్టయ్యేలా సినిమా టైటిల్‌ ఉండబోతోందనీ తాజాగా అందుతోన్న సమాచారమ్‌. టబు పాత్ర పేరు 'అలకనంద' అనీ, ఆ పాత్రతోనే సినిమా టైటిల్‌ ఉండబోతోందనే గాసిప్‌ తాజాగా సర్క్యులేట్‌ అవుతోంది.

 

అంటే త్రివిక్రమ్‌ ఈ సారి కూడా 'అ' లెటర్‌కే ఓటేసినట్లన్నమాట. సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా త్రివిక్రమ్‌ 'అ' అక్షరంతో టైటిల్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తుండడం విశేషం. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS