'బిగ్‌' సెలబ్రిటీ అలీ రైజా!

మరిన్ని వార్తలు

యాపీ ఫిజ్‌ టాలెంట్‌ టాస్క్‌లో ఫైనల్‌ బెస్ట్‌ పర్‌ఫామర్‌గా నిలిచాడు అలీ. ఆయనకు గిఫ్ట్‌గా బిగ్‌బాస్‌ ఓ కోటునిచ్చారు. ఆ కోటును ఈ వారమంతా ధరించాలని బిగ్‌బాస్‌ అలీకి సూచించారు. అంతేకాదు, ఈ వారమంతా అలీని హౌస్‌లో ఓ సెలబ్రిటీగా చూడాలన్నారు. ఆయనతో ఏ పనులూ చేయించకూడదని ఆదేశించారు. అలా అలీ మరోసారి హౌస్‌లో సకల సౌకర్యాలనూ అనుభవించే ఛాన్స్‌ కొట్టేశాడు.

 

మొదటి రౌండ్‌లో భాగంగా 'సింగ్‌ జరా..' సాంగ్‌కి హాట్‌ హాటెస్ట్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చి, బెస్ట్‌ ఆఫ్‌ 4 గా నిలిచిన ఆలీ, తర్వాత లవ్‌ ఫెయిల్యూర్‌ కాన్సెప్ట్‌తో హార్ట్‌ టచ్చింగ్‌ యాక్టింగ్‌ చేసి, హౌస్‌మేట్స్‌ని, జడ్జెస్‌ని ఇంప్రెస్‌ చేశాడు. టాప్‌ 4లో మహేష్‌, అలీ, రవి, వరుణ్‌ నిలిచారు. తర్వాత బెస్ట్‌ ఆఫ్‌ 2 లో అలీకి రవికృష్ణ పోటీ ఇచ్చాడు. ఫైనల్‌ రౌండ్‌కి చేరిన అలీ రైజా, రవికృష్ణలలో ఒకరిని ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఎన్నుకోవాలి. అలా అలీకి ఎక్కువ మంది ఇంటి సభ్యుల సపోర్ట్‌ లభించడంతో బెస్ట్‌ పర్‌ఫామర్‌ ఆఫ్‌ ది యాపీ ఫిజ్‌ టాలెంట్‌ టాస్క్‌గా అలీ ఫైనల్‌ అయ్యాడు.

 

మొన్న కెప్టెన్‌గా అలీ తనదైన స్టైల్‌ చూపించాడు. నాగార్జునతో బెస్ట్‌ కెప్టెన్‌ అని ప్రశంసలు పొందాడు. ఇప్పుడు పర్‌ఫామెన్స్‌లోనూ హీరో అనిపించుకున్నాడు. మంచి పర్‌ఫామర్‌ ఉన్నాడనీ, ఫ్యూచర్‌లో మంచి మంచి అవకాశాలు అలీని వరించాలని, జడ్జ్‌గా బాబా భాస్కర్‌ కూడా ఆశీర్వదించాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS