చందమామ కాజల్‌కి ఎందుకిలా జరుగుతోంది.? అసలే అంతంత మాత్రం ఆఫర్లు దక్కించుకుంటోంది. ఆ దొరికిన ఆఫర్స్‌లో కటింగ్స్ ఆమెను వెంటాడుతున్నాయి. 'రణరంగం' సినిమాలోనూ కాజల్ సీన్లు కొన్ని ఎక్స్‌ట్రాగా అనిపించాయనే టాక్ రావడంతో విడుదల తర్వాత కట్ చేసేశారు. తమిళ 'క్వీన్' 'ప్యారిస్ ప్యారిస్' విషయంలోనూ బోల్డ్ సీన్స్ ఎక్కువయ్యాయంటూ, సెన్సార్ బోర్డ్ ఎక్కువగా కత్తిరించేసింది. దీంతో కాజల్ చాలా ఫీలయ్యింది. మధ్యలో వచ్చిన 'కోమాలి' కాస్త ఊరటనిచ్చింది.
వయసు మీద పడుతున్నా, వన్నె తరగని అందం చందమామది. కానీ, ఏం లాభం? సెన్సార్ కత్తెరలు ఆమెలో అసహనాన్ని పెంచేస్తున్నాయి. ఈ మధ్య గ్లామర్ డోస్ కాస్త పెంచేసింది కాజల్ అగర్వాల్. ఆ తరుణంలో ఓ బోల్డ్ కంటెంట్ మూవీ కాజల్ చెంతకొచ్చిందట. కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ, ఎందుకో కాజల్ రిస్క్ చేయదలచుకోలేదట. ఇప్పటికే బోల్డ్ సీన్స్ కారణంగానే కటింగ్స్‌కి గురి కావల్సి వస్తోంది. ఇక టోటల్ బోల్డ్ కంటెంట్ అంటే, విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిందట కాజల్ అగర్వాల్.
అదో బాలీవుడ్ రీమేక్ అనీ తెలుస్తోంది. ఇన్నేళ్లుగా గ్లామర్ తారగా వెలుగొందుతున్నా, విమర్శలకూ, అర్ధం పర్ధం లేని రూమర్స్‌కి అతీతురాలు కాజల్ అగర్వాల్. అలాంటిది, కోరి ఎందుకు కష్టం తెచ్చుకోవడమెందుకని, తాజా ఆఫర్‌ని వదిలేసుకుంది కాబోలు. ఇకపోతే, కాజల్ తమిళంలో విశ్వ నటుడు కమల్ హాసన్‌తో 'ఇండియన్ 2'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు, తెలుగులోనూ మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట.