బన్నీని ఇంప్రెస్‌ చేసిన 'మెంటల్‌' భామ.!

By iQlikMovies - August 23, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

బన్నీకి ఓ హీరోయిన్‌ నచ్చిందంటే చాలు, వరుసగా తన సినిమాల్లో ఏదో ఒక ఛాన్స్‌ ఇస్తూనే ఉంటాడు. హాట్‌ అండ్‌ క్యూటీ కేథరీన్‌ని బన్నీ అలాగే పలుమార్లు అవకాశాలిచ్చి ఆదుకున్నాడు. తాజాగా ఇప్పుడలాంటి ఛాన్స్‌ కొట్టేసింది ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్‌. ఈ భామ 'మెంటల్‌ మదిలో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాకే మంచి పేరు కొట్టేసింది. యాక్టింగ్‌ స్కిల్స్‌, స్క్రీన్‌ ప్రెజన్స్‌లో మంచి మార్కులు తెచ్చుకోవడంతో, అవకాశాలు బాగానే అందుకుంటోంది.

 

మొన్నీ మధ్యనే 'చిత్రలహరి' సినిమాలో నటించి మెప్పించింది. మెప్పుతో పాటు, హిట్‌ కూడా అందుకుంది. తర్వాత 'బ్రోచేవారెవరురా' సినిమాలోనూ తళుక్కున మెరిసింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్‌ దృష్టిలో పడింది. ఆల్రెడీ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న 'అల వైకుంఠపురము'లో చిత్రంలో బన్నీకి చెల్లెలి పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు, బన్నీ నివేదాకి మరో ఛాన్స్‌ ఇచ్చాడట. బన్నీ నటిస్తున్న 'ఐకాన్‌' చిత్రంలో నివేదాకి హీరోయిన్‌ ఛాన్స్‌ ఇచ్చాడట. ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామ కోసం వెతుకులాట సాగిస్తున్న సంగతి తెలిసిందే.

 

అయితే, సెకండ్‌ హీరోయిన్‌గా నివేదాని హోల్డ్‌లో పెట్టాడట. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చూశారుగా, బన్నీ ఒక్కసారి ఛాన్సిస్తే ఇలాగే ఉంటుంది. 'చిత్రలహరి'లో ఆమె నటనకు ఫిదా అయిపోయిన బన్నీ, ఏరికోరి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాకి నివేదా పేరు సూచించాడట. అనుకోకుండా 'ఐకాన్‌'కీ సెట్‌ అయ్యిందట. ఇంతలా బన్నీని ఇంప్రెస్‌ చేసిన ఈ 'మెంటల్‌' భామ ఇంకెన్ని అవకాశాలు అంది పుచ్చుకుంటుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS