బిగ్‌ సీక్రెట్‌: అలీరెజా రీ ఎంట్రీ వెనక అసలు రహస్యమేంటంటే.!

మరిన్ని వార్తలు

హౌస్‌లో అలీ రెజాకీ, శివజ్యోతికీ మధ్య అన్నా చెల్లెలి డీప్‌ రిలేషన్‌ షిప్‌ ఉన్న సంగతి తెలిసిందే. అలీ రెజా ఎలిమినేట్‌ అయినప్పుడు ఏకంగా రెండు రోజులు ఏడుస్తూనే ఉంది శివజ్యోతి. ఇక అలీ రెజా రీ ఎంట్రీతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్‌. ఇదిలా ఉంటే, తాజా టాస్క్‌లో భాగంగా, ఆలీ రెజా, శివజ్యోతి మధ్య జరిగిన సంభాషణల సారాంశం ప్రకారం, శివజ్యోతిని టైటిల్‌ విన్నర్‌గా నిలబెట్టడమే తన కర్తవ్యం.. తాను హౌస్‌లోకి వచ్చిందే అందుకోసం.. అన్నట్లుగా ఆడియన్స్‌కి కనెక్ట్‌ చేశాడు.

 

శివజ్యోతి టైటిల్‌ విన్నర్‌ కావడానికి ఆడియన్స్‌ ఒప్పుకుంటారా.? ఆ సంగతి పక్కన పెడితే, 'బ్యాటిల్‌ ఆఫ్‌ ది మెడాలియన్‌' టాస్క్‌లో కూడా తన ఆట మానేసి, శివజ్యోతి ఆటాడేశాడు అలీ రెజా. ఆ కారణంగా హౌస్‌ మేట్స్‌ అలీ రెజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీముఖి అయితే పెద్ద రచ్చే చేసింది. శ్రీముఖితో వాదులాటకు దిగాడు అలీ రెజా. ఆ సిట్యువేషన్‌లోనే తన కోసం నీ ఆట వదిలేసుకుంటున్నావ్‌.. రేపు తన కోసం బిగ్‌బాస్‌ టైటిల్‌ కూడా ఇచ్చేస్తావా? అని శ్రీముఖి ప్రస్థావించింది.

 

అవును ఇచ్చేస్తాను.. అని అలీ రెజా బయట పడిపోయాడు. దాంతో అలీ రెజా రీ ఎంట్రీ వెనక రహస్యమిదే అని అర్ధమైపోయింది. ఈ వారం అలీ రెజా ఎలిమినేట్‌ అవుతాడనుకున్నారంతా. కానీ, అసలు నామినేషన్స్‌లోకే రాలేదు అలీ రెజా. మరి అలీ రెజా ఆశించినట్లు బిగ్‌బాస్‌ టైటిల్‌ శివజ్యోతిని వరిస్తుందా? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS